ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ
నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశిపురంలోని ప్రసిద్ధ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ పట్టనుంది. ఆలయ సమగ్ర అభివృద్ధి, సుందరీకరణతో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి...
– రూ.15 కోట్లతో సమగ్ర అభివృద్ధి, సుందరీకరణ పనులు
కనగల్, నవంబర్ 19 : నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశిపురంలోని ప్రసిద్ధ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ పట్టనుంది. ఆలయ సమగ్ర అభివృద్ధి, సుందరీకరణతో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదన మేరకు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGTDC) అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆలయ పరిసర ప్రాంతాలను మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, పర్యాటక అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ఈ పనులు చేపట్టనున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ధర్వేశిపురం ఆలయం ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటక పరంగా కూడా మరింత గుర్తింపు పొందనుంది. ఆలయ అభివృద్ధికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రూ.15 కోట్ల నిధులు మంజూరు చేయించడం పట్ల ఆలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి పాలకవర్గం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ
ప్రమాద రహిత సింగరేణి.. నూతన కార్మిక భద్రతా నిబంధనలపై అవగాహన శిబిరం
Women | మా పిల్లలకు జాబుల్లేవ్, కరెంట్ బిల్లు కూడా మాఫీ లేదు.. రేవంత్ రెడ్డికి సభకు వచ్చిన మహిళ
Health Tips | షుగర్ కంట్రోల్లో ఉండాలంటే మీ ఆహారంలో ఇవి భాగం కావాల్సిందే..!
మోరంపల్లిబంజర్ పీహెచ్సీలో శ్రమదానం.. సమిష్టి భోజనం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

