Women | మా పిల్లలకు జాబుల్లేవ్, కరెంట్ బిల్లు కూడా మాఫీ లేదు.. రేవంత్ రెడ్డికి సభకు వచ్చిన మహిళ
Women | సిద్దిపేటలో రేవంత్ రెడ్డికి సభకు హాజరైన ఓ మహిళ కాంగ్రెస్ కండువా వేసుకొని మరీ కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగాలు వేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Women | 2 లక్షల ఉద్యోగాలిస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డిపై ఇప్పటికే నిరుద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారని తెలిసిందే. ఉద్యోగాలిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఒక్క జాబ్ కూడా ఇస్తలేడని ఓ మహిళ ఫైర్ అయ్యింది. సిద్దిపేటలో రేవంత్ రెడ్డికి సభకు హాజరైన ఆ మహిళ కాంగ్రెస్ కండువా వేసుకొని మరీ ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
సదరు మహిళను మీడియా పలుకరించగా.. కూలీ పనులు చేసి మా పిల్లలను కష్టపడి చదివించాం.. కానీ రేవంత్ రెడ్డి వచ్చినంక మాకు 40 ఏండ్లు వచ్చినా జాబ్ రాకపాయే అని మా పిల్లలు ఎంతో బాధపడుతున్నరని ఆవేదన వ్యక్తం చేసింది.. మాకు వ్యవసాయం లేదు.. పిల్లలకు జాబుల్లేవ్.. కరెంట్ బిల్లు కూడా మాఫీ లేదు.. కరెంట్ బిల్లు రూ.800 కడుతున్నం.. ఎన్ని సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా కాదమ్మా.. కూలీ చేసుకుంటూ కరెంట్ బిల్లు కడుతున్న నేను.. మీటింగ్‌కు వచ్చిన రేవంత్ రెడ్డికి ఏమన్నా చెప్తామంటే అక్కడిదాకా మమ్మల్ని పోనిస్తరా..? అని వాపోయింది.
సిద్ధిపేటలో రేవంత్ మీటింగ్‌కు వచ్చి రేవంత్ రెడ్డినే తిడుతున్న మహిళలు
40 ఏళ్లు వచ్చాయి జాబ్ వస్తలేదని మా పిల్లలు ఏడుస్తున్నారు
పిల్లలకు జాబ్స్ ఇస్తానని అబద్ధం చెప్పి గెలిచి ఒక్క జాబ్ ఇస్తలేడు
వ్యవసాయం చెయ్యడానికి కరెంట్ ఇస్తలేడు.. కరెంట్ బిల్ మాఫీ అయితలేదు https://t.co/LEJ118CUWK
— Telugu Scribe (@TeluguScribe) November 19, 2026
Read Also :
Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష.. రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు
Telangana RERA | రెరా.. ఇది తగునా? రియల్ రంగంలో అవినీతికికొమ్ముకాస్తున్నట్లు విమర్శలు
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మా పిల్లలకు జాబుల్లేవ్, కరెంట్ బిల్లు కూడా మాఫీ లేదు.. రేవంత్ రెడ్డికి సభకు వచ్చిన మహిళ
Health Tips | షుగర్ కంట్రోల్లో ఉండాలంటే మీ ఆహారంలో ఇవి భాగం కావాల్సిందే..!
మోరంపల్లిబంజర్ పీహెచ్సీలో శ్రమదానం.. సమిష్టి భోజనం
Diabetes | డయాబెటిస్ ఉన్నప్పటికీ ఆరోగ్యంగా జీవిస్తున్న సెలబ్రిటీలు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఢోకా ఉండదు..
బోడంగిపర్తిలో ఘనంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

