Deepinder Goyal | ఇంజినీర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న జొమాటో ఫౌండర్.. కానీ, ఈసారి కొత్త రూల్స్
Deepinder Goyal : జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ త్వరలో టెంపుల్ అనే కొత్త వేరబుల్ డివైజ్ను తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీలో పని చేసేందుకు ఇంజినీర్లను తీసుకుంటున్నట్లు దీపిందర్ వెల్లడించాడు.
Deepinder Goyal : జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ త్వరలో టెంపుల్ అనే కొత్త వేరబుల్ డివైజ్ను తీసుకురానున్న సంగతి తెలిసిందే. టెంపుల్.. ఇదో స్టార్టప్ కంపెనీ. ఈ కంపెనీలో పని చేసేందుకు ఇంజినీర్లను తీసుకుంటున్నట్లు దీపిందర్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించాడు. ఈ మేరకు ఒక ప్రత్యేక పోస్ట్ పెట్టాడు. వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నట్లు వెల్లడించాడు.
మెషీన్ లెర్నింగ్, కోడింగ్, న్యూరల్ డీకోడింగ్ వంటి అంశాల్లో ఇంజినీర్లు కావాలన్నాడు. అయితే, ఇక్కడే ఒక మెలిక పెట్టాడు. ఈసారి ఈ టెక్నికల్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తోపాటు కొన్ని ప్రత్యేక క్వాలిటీస్ కూడా ఉండాలన్నాడు. ఉద్యోగాలు కావాలనుకునే యువతలో అమ్మాయిలకైతే బాడీ ఫ్యాట్ 26 శాతం కంటే తక్కువగా, అబ్బాయిలకైతే 16 శాతం కంటే తక్కువగా ఉండాలన్నాడు. ఒకవేళ ఫిట్నెస్ పరంగా ఈ ప్రమాణాలతో లేనివారికి కూడా ఇంకో అవకాశం ఇచ్చాడు. మూడు నెలల ప్రొబెషన్ పీరియడ్ ఉంటుందని, ఆలోపు ఈ ఫిట్నెస్ సంపాదించవచ్చని కూడా దీపిందర్ వెల్లడించాడు. నిపుణులు తాము ఏం తయారు చేస్తున్నారో, దాన్ని ధరించి, పరీక్షించాలని దీపిందర్ అన్నాడు. అన్నింటికీ మించి అథ్లెట్స్, ఇంజినీర్స్ అయిన వాళ్లు కావాలన్నాడు.
టెంపుల్ అనే వేరబుల్ డివైజ్ ఫిట్నెస్కు సంబంధించింది. ముఖ్యంగా దీన్ని అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న వాటికి భిన్నంగా, మరింత కచ్చితత్వంతో పని చేసేలా, ఎక్కువ కొలమానాల్ని అందించేలా దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఫిజియోలాజికల్, న్యూరోలాజికల్ మెట్రిక్స్ అందిస్తుంది. టెంపుల్ డివైజ్ ఇంకా నమూనా, ప్రయోగాత్మక దశలోనే ఉంది. ఇటీవల పలుమార్లు దీపిందర్ ఈ డివైజ్ ధరించి కనిపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

