BRS Rajatostava Sabha | రాయపర్తి : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న భారత రాష్ట్ర సమితి రజతోత్సవ వేడుకల బహిరంగ సభ కుంభమేళాను తలపించాలని భారత రాష్ట్ర సమితి రాయపర్తి మండల పార్టీ అధ్యక్షుడు మునావత్ నరసింహ నాయక్ కోరారు. ఇవాళ మండలంలోని రాయపర్తి, రాగన్న గూడెం, వెంకటేశ్వర పల్లి, శివరామపురం, మైలారం గ్రామాలలో పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి గ్రామ పార్టీ అధ్యక్షులతో గులాబీ జెండాలను ఆవిష్కరింపజేశారు.
ఈ సందర్భంగా నరసింహ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ రథసారథి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం కోసం యావత్ తెలంగాణ రాష్ట్రం, ప్రపంచమంతా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలతో గత 17 నెలలుగా రాక్షస పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి సర్కారుకు ఎల్కతుర్తి సభతో పతనం ఆరంభం అవుతుందన్నారు. అహింసాయుత పద్ధతులలో సుదీర్ఘ కాలంపాటు పాలన సాగించిన కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్రంలోని సకల వర్గాల ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలుపుకొంటున్నారని ఆయన వివరించారు.
భారత రాష్ట్ర సమితి, గులాబీ నేతలపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నేతలకు ఎల్కతుర్తి సభతో కేసీఆర్ కళ్లు తెరిపిస్తాడని వివరించారు. మండలంలోని 40 గ్రామాల నుండి గులాబీ శ్రేణులు, తెలంగాణ వాదులు, కేసిఆర్ అభిమానులు ప్రత్యేక వాహనాల్లో వేలాదిగా తరలివెళ్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు రంగు కుమార్, పూస మధు, గారె నర్సయ్య, అయిత రామచందర్, ముద్రబోయిన సుధాకర్, చందు రామ్ యాదవ్, లేతాకుల మధుకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మహమ్మద్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
Giloy | సర్వ రోగ నివారిణి.. తిప్పతీగ.. మన చుట్టూ పరిసరాల్లోనే ఈ మొక్క పెరుగుతుంది..!
Putta Madhukar | మంత్రి పదవి మంథనికి పైస మందం కూడా పనికొస్తలేదు : పుట్ట మధుకర్
BRS | బీఆర్ఎస్ సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు రావని బెదిరిస్తున్నారు : దాసరి మనోహర్ రెడ్డి