ఖిలావరంగల్, మార్చి 02 : గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్ శివనగర్‌లో ఆదివారం బీజేపీ మహిళా అధ్యక్షురాలు జారతి దేవక్క ఆధ్వర్యంలో గామా ఫౌండేషన్ సహకారంతో వంద మంది పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై సరుకులు అందజేసి మాట్లాడారు. పేదవారికి ఆకలి తీర్చే దిశగా గామ ఫౌండేషన్ సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు.
ప్రతి ఒక్కరు పేదవారికోసం సామజిక బాధ్యతగా తోచినంత సహాయం అందిస్తే మరింత మందికి సహాయం అందించే అవకాశం ఉంటుందన్నారు. శివనగర్ బీజేపీ అధ్యక్షుడు ఎండీ రఫీ, ఓబీసీ మోర్చ అధ్యక్షుడు బోడకుంట్ల శివశంకర్, బూత్ కమిటీ నాయకులు, శక్తి కేంద్ర ఇంచార్జీలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Prahlad Patel | ‘ప్రజలు యాచించే అలవాటును పెంచుకున్నారు’.. బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
Karakkaya | అనేక వ్యాధులను తగ్గించే కరక్కాయ.. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయంటే..?