హైదరాబాద్, మార్చి 13 : ఇనుప ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ ఎన్ఎండీసీ మరో మైలురాయికి చేరుకున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 50 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పింది.
ఒకే ఏడాది ఇంతటి స్థాయిలో ఖనిజాన్ని ఉత్పత్తి చేసిన ప్రభుత్వరంగ తొలి సంస్థ ఎన్ఎండీసీ కావడం విశేషం.