హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : ట్రాన్స్పోర్ట్ ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్ ఎదుగుతున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ నెల 17న నగరంలోని నోవాటెల్‌లో జరుగనున్న ‘సెకండ్ నేషన్ మొబిలిటీ సమ్మిట్’పై శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో రవాణా రంగం, స్మార్ట్ మొబిలిటీ, ఈవీలు వంటి అంశాలపై చర్చించేందుకు ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.