హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ భారీ జీఎస్టీ కుంభకోణాన్ని బయటపెట్టింది. సుమారు రూ.84.15 కోట్ల విలువైన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) మోసం జరిగినట్టు గుర్తించింది. ప్రధాన నిందితుడు, ఎస్కేజీ ట్రేడింగ్ కంపెనీ యజమాని సందీప్‌ను అధికారులు అరెస్టు చేశారు.
నకిలీ ఇన్వాయిస్ల ద్వారా ఐటీసీ పొందినట్టు గుర్తించారు. సందీప్‌కు సంబంధమున్న ఇతర సంస్థల్లోనూ అక్రమాలున్నట్టు తేలింది. వాటి రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. సందీప్‌ను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.