హనుమకొండ, మే 22 : అమెరికాలో ఈ నెల 30, 31వ తేదీల్లో నిర్వ హించనున్న గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభకు హాజరుకావాలని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు గురువారం హైద్రాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సంఘం అధ్యక్షుడు వంశి, కొండ దేవయ్య కలిసి ఆహ్వాన పత్రికను అందజేసారు. శాలువాతో సత్కరించారు. మున్నూరు కాపు సంఘం బలోపేతం కోసం ప్రపంచం నలుమూలల ఉన్న మున్నూరు కాపులను అమెరికా వేదికగా ఏకం చేయున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.