IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) తొలి టైటిల్ గెలవాలనే కసితో ఉంది. చివరి లీగ్ మ్యాచ్‌లను విజయంతో నాకౌట్ పోరుకు ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలని ఆర్సీబీ భావిస్తోంది. అయితే.. ఆ జట్టులోని విదేశీ క్రికెటర్లు కీలకమైన ప్లే ఆఫ్స్‌కు దూరం కానుండడంతో కొత్తవాళ్లను తీసుకుంటోంది బెంగళూరు యాజమాన్యం. ఇప్పటికే పేసర్ లుంగి ఎంగిడి బదులు జింబాబ్వే స్పీడ్‌స్టర్ బ్లెస్సింగ్స్ ముజరబనికి తమ బృందంలో చోటు కల్పించిన ఫ్రాంచైజీ.. తాజాగా మరొకరిని ఎంపిక చేసింది.
వెస్టిండీస్ సిరీస్ కోసంస్వదేశం వెళ్లనున్న యంగ్‌స్టర్ జాకబ్ బెథెల్ (Jacob Bethell) స్థానంలో న్యూజిలాండ్ చిచ్చరపిడుగు టామ్ సీఫర్ట్ (Tom Seifert)ను స్క్వాడ్‌లో చేర్చుకుంది. మే 24న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ తర్వాత నుంచి బెథెల్ ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశముంది. దాంతో, న్యూజిలాండ్ చిచ్చరపిడుగు సీఫర్ట్‌ను స్క్వాడ్‌లో చేర్చుకుంది ఆర్సీబీ. ఈ విషయాన్ని గురువారం ఎక్స్ వేదికగా బెంగళూరు ఫ్రాంచైజీ ప్రకటించింది.
When firepower meets form, we get an absolutely destructive combo. 🔥
Tim’s ready to take off, and WE. CAN. NOT. WAIT! 🙌#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/OFQ2j1qb8R
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 22, 2025
విధ్వంసక ఇన్నింగ్స్‌లతో అలరించే సీఫర్ట్‌కు ఇంతకుముందు ఐపీఎల్ అనుభవం ఉంది. తొలిసారి 2022లో ఈ చిచ్చరపిడుగు ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు ఆడాడు. 17వ సీజన్లో ఈ కివీస్ స్టార్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. వికెట్ కీపర్, బ్యాటర్ అయిన న్యూజిలాండ్ తరపున సీఫర్ట్ టీ20ల్లో నిలకడగా రాణిస్తున్నాడు. 262 మ్యాచుల్లో 133.07 స్ట్రయిక్ రేటుతో 5,862 పరుగులు సాధించాడా హిట్టర్. దాంతో, మిడిలార్డర్లో దూకుడుగా ఆడగల ఈ కివీస్ బ్యాటర్‌ను తమ స్క్వాడ్‌లో చేర్చుకుంది ఆర్సీబీ. ఈ సీజన్ తదుపరి మ్యాచ్‌ల కోసం అతడికి రూ.2 కోట్లు చెల్లించనుంది ఫ్రాంచైజీ. మే 7న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో సీఫర్ట్ బరిలోకి దిగే అవకాశముంది.
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ వాయిదా పడడంతో ఆర్సీబీ ప్రధాన పేసర్ హేజల్‌వుడ్ (Hazlewood) స్వదేశంలోనే ఉండిపోయాడు. గాయం నుంచి కోలుకుంటున్న అతడు డబ్ల్యూటీసీ ఫైనల్ సన్నద్ధతలో ఉన్నాడు. ఇక పేసర్ లుంగి ఎంగిడి సైతం మే 25 తర్వాత దక్షిణాఫ్రికా వెళ్లనున్నాడు. దాంతో, అతడి స్థానాన్ని బ్లెస్సింగ్ ముజరబని తో భర్తీ చేయనుంది ఆర్సీబీ.
Standing at 6’8”, bowling from a higher trajectory – Muzarabani is truly a 𝑩𝒍𝒆𝒔𝒔𝒊𝒏𝒈 to have in the side.
Pace, bounce, and that steep angle – make him hard to score off and he’s adding all the skills to our attack! 💥🔥#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/f2KZmFsqOc
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 19, 2025
ఇక.. లీగ్ పునరుద్దరణ తర్వాత మే 17న బెంగళూరు, కోల్‌కతా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్ఫణం అయింది. అయినా సరే ఢిల్లీ క్యాపిటల్స్‌ను గుజరాత్ టైటాన్స్ ఓడించడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. అయితే.. చివరి రెండు లీగ్ మ్యాచుల్లో విజయంతో ప్లే ఆఫ్స్ ఫైట్‌కు సిద్ధం కావాలని రజత్ పాటిదార్ బృందం భావిస్తోంది.