అర్వపల్లి, మే 22 : ఆయిల్‌పామ్ తోటలను సాగు చేసే రైతులు ప్రాథమిక దశలోనే సరైన యాజమాన్యం పద్ధతులు పాటించినట్లు అయితే మంచి దిగుబడి సాధించవచ్చు అని పతంజలి ఆయిల్‌పామ్ కంపెనీ మేనేజర్ జె.హరీశ్, ఏఈఓ నేరెళ్ల సత్యం తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలోని అడివేముల గ్రామంలో మన్నెం సదశివారెడ్డి ఆయిల్‌పామ్ తోటలో గెలల కోత, నాణ్యతా ప్రమాణాలపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ తోటలను సాగు చేసే రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తే దీర్ఘకాలం పాటు మంచి దిగుబడి సాధించి ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చు అన్నారు. ఆయిల్ పామ్ తోటలు నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలన్నారు.
షెడ్యూల్ ప్రకారం ఎరువులు వేసినట్లైతే నాణ్యమైన దిగుబడి వస్తుందన్నారు. ఉద్యాన శాఖ ద్వారా తోటల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు, రైతులు రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ మేనేజర్ వి.శశికుమార్, పతంజలి ఆయిల్‌పామ్ ఫీల్డ్ సూపర్వైజర్ రంగు ముత్యంరాజు, రమేశ్, రైతులు ముదిరెడ్డి సంతోశ్ రెడ్డి, కె.చిన్న తీరుమల్రావు, అనిరెడ్డి రాజేందర్ రెడ్డి, సుందర్ రెడ్డి, ఉమాకర్ రెడ్డి, సోమిరెడ్డి, కొండల్ రెడ్డి, లింగరాజు, బాకు మల్లయ్య, సోమయ్య, ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.