బన్సీలాల్‌పేట్, ఫిబ్రవరి 17: గాంధీ దవాఖానలో మంగళవారం ఇంటెన్సివ్ కరోనరీ కేర్ యూనిట్‌ను సూపరింటెండెంట్ డాక్టర్ వాణి చేతులమీదుగా ప్రారంభించారు. 5వ అంతస్తులోని కార్డియాలజీ విభాగంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌ను అర్పన్, రోగి సహాయతా ట్రస్ట్, ఎస్వీఎస్ రెఫ్ కమ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు అందించిన ఆర్థిక సహకారంతో ఆధునీకరించినట్లు తెలిపారు.
దాతల సహకారంతో సమకూర్చిన వైద్యపరికరాలు.. రోగులకు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. ట్రస్ట్ నిర్వాహకులు వనిత, మనీశా, కోమల్, ఆరాధన, అనిత, పూనం, పవన్, త్రినబ్ త్యాగి, కార్డియాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్‌శ్రీనివాస్, డాక్టర్ అర్షద్, డాక్టర్ దత్తప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.