హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి కేరళలో జరిగే ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. మంగళవారం సాయంత్రం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన వెళ్లారు.
స్టార్ క్యాంపెయినర్‌గా రెండు రోజులపాటు యూడీఎఫ్ అభ్యర్థుల తరఫున కేరళలోని వివిధ చోట్ల జరిగే ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొననున్నారు.