అమరచింత, జూలై 29 : పేరుకు రైతు ప్రభుత్వమని గొప్పులు చెప్పుకుంటున్న కాం గ్రెస్ ప్రభుత్వానికి రైతు సమస్యలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన ప్రాజెక్టు అధికారులతో నీటినిల్వను వివరాలను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం మాట్లాడుతూ వానకాలం ప్రారంభమై రెం డు నెలలు దాటినా సరైన వర్షాలు లేకపోవడంతో వరి నారు పోసుకుని నా ట్లు వేసేందుకు రైతులు ని త్యం సాగునీటి కోసం ఎదురుచూస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆ గ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు వెంటనే సాగునీటిని విడుదల చేయకుంటే జూరా ల ప్రాజెక్టుపై ధర్నా చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరించడంతో ప్రభుత్వం దిగివచ్చి బుధవా రం 11గంటలకు ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేశారన్నారు. చిన్నపాటి కార్యక్రమాలకు పెద్దఎత్తున హడావుడి చేస్తున్నా పాలకులు, రైతులకు సాగునీరును విడుదల చేయడంలో ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. సాగునీటి కోసం రైతులు ఆందోళనకు దిగితే తప్పా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. ఆయన వెంట రవికుమార్‌యాదవ్, బీఆర్ఎస్ నాయకులు రాజేందర్‌సింగ్, నర్సింహులుగౌడ్, రాజు, నాగభూషణంగౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, పెద్ద ఎత్తున రైతులు ఉన్నారు.