Assam Police : అసోం రాజధాని గువహటిలో సీజేపీ నేతలను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. సీజేపీ కో ఫౌండర్ అశుతోష్ రాంకా సహా పలువురు సీజేపీ నేతల్ని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అసోంలో పాఠశాలల పరిస్థితిని గురించి అంచనా వేసేందుకు అధ్యయన బాట పట్టారు. అసోంలోని విద్యాలయాల్ని పరిశీలించడం, అక్కడి వాస్తవ పరిస్థితుల్ని బయటపెట్టడం, కజిరంగ అభయారణ్యం పరిస్థితి, అడవులు, కృత్రిమ వరదలు వంటి పరిస్థితుల్ని అసోం ప్రజలకు, ఇండియాకు వివరించాలని తాము పర్యటన చేపట్టినట్లు సీజేపీ నేతలు అన్నారు.
అయితే, తమను అడ్డుకోవడం ద్వారా అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తమకు భయపడ్డారని సీజేపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రంలోని భూముల్ని, అడవుల్ని, నీటిని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతోందని అశుతోష్ రాంకా విమర్శించారు. రాంకా సహా సీజేపీ నేతల్ని అదుపు చేయడంపై సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అశుతోష్ రాంకా సహా సీజేపీ నేతల్ని అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వారిని రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లారని దీప్కే పోస్టులో పేర్కొన్నారు.
🚨URGENT🚨
The entire road leading to the meet-up site has been barricaded from both sides. Assam police is ready with tear gas.
Our volunteers are being detained. No one is being allowed to reach the meet-up site.
Why is Assam govt so scared of @Cockroachisback? pic.twitter.com/DuR0tvBB56
— Ashutosh Ranka (@AshutoshRanka) September 27, 2026
అశుతోష్ రాంకా కూడా ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సీజేపీ తమకు భయపడిందని, తాము నిజాల్ని బయటపెడతామనే ఉద్దేశంతో అదుపులోకి తీసుకుందని విమర్శించారు. సీజేపీ నేతల్ని ప్రభుత్వం భయపెడుతోందన్నారు. మరోవైపు సీజేపీ ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వెళ్లకుండా వాలంటీర్లను కూడా ప్రభుత్వం అడ్డుకుంది. దీనిపై సీజేపీ విమర్శలు చేస్తోంది. సీజేపీ వేదిక వద్దకు వెళ్లే రోడ్డును పోలీసులు బ్లాక్ చేశారు.