హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 27: కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుతరాలకు అందించాలని శ్రీభక్తమార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్‌బాబు అన్నారు. ఆదివారం హనుమకొండ రెడ్డికాలనీలోని శ్రీభక్తమార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం రమేశ్‌బాబు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ సహకారసంఘాల రూపకర్తగా, పాదయాత్రల సృష్టికర్తగా, తెలంగాణ కోసం తొలిసారి తన మంత్రి పదవీని తృణప్రాయంగా త్యాగం చేసిన త్యాగశీలిగా, తొలి, మలి ఉద్యమాలకు ఊపిరిపోసిన ఉద్యమ నేతగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి గురపు రమేశ్, కోశాధికారి నరెట్ల మహేందర్, ఉపాధ్యక్షుడు దుంపేటి నరేందర్‌బాబు, బేతి రమేశ్, గోరంట్ల రాజ్‌కుమార్, కూచన సురేష్, గంజి రాజేందర్, లింగబత్తుల సత్తయ్య, తేరాల శ్రీధర్, బత్తుల మహేందర్, కూరపాటి శ్రీనివాస్, కొంగ సారంగపాణి, కందకట్ల నరేష్, చెన్నూరి రాజు, దుంపేటి నవీన్‌కుమార్ పాల్గొన్నారు.