IND vs WI | తొలి బ్రేకిచ్చిన కుల్దీప్.. విండీస్ విధ్వంసక ఓపెనర్ ఔట్..!
IND vs WI : తిరువనంతపురం వన్డేలో భారత్‌కు ఎట్టకేలకు వికెట్ దక్కింది. శతక భాగస్వామ్యంతో విసిగించిన ఓపెనింగ్ జోడీని విడదీసిన కుల్దీప్ యాదవ్(1-18) తొలి బ్రేకిచ్చాడు.
IND vs WI : తిరువనంతపురం వన్డేలో భారత్‌కు ఎట్టకేలకు వికెట్ దక్కింది. శతక భాగస్వామ్యంతో విసిగించిన ఓపెనింగ్ జోడీని విడదీసిన కుల్దీప్ యాదవ్(1-18) తొలి బ్రేకిచ్చాడు. టీమిండియా బౌలర్లను కాచుకొని.. మెరుపు అర్ధ శతకంతో చెలరేగిన జాన్ క్యాంప్‌బెల్(62)ను అతడు బోల్తా కొట్టించాడు. స్వీప్ షాట్‌కు యత్నించిన విండీస్ ఓపెనర్ ప్రసిధ్ కృష్ణ చేతికి చిక్కాడు. దాంతో..135 పరుగుల మొదటి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
మూడు వన్డేల సిరీస్ తొలి మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్(1-18) మొదటి వికెట్ అందించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌లో జోరు చూపించిన వెస్టిండీస్ ఓపెనింగ్ ద్వయాన్ని విడదీశాడీ చైనామన్ బౌలర్. పవర్ ప్లేలో దంచేసి.. విండీస్ భారీ స్కోర్‌కు పునాది వేసిన జాన్ క్యాంప్‌బెల్(62)ను కుల్దీప్ పెవిలియన్ పంపాడు. 20వ ఓవర్లో అతడు ఫ్లయిట్ చేసిన రెండో బంతిని స్వీప్ షాట్‌కు ప్రయత్నించిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. ప్రసిధ్ కృష్ణకు దొరికాడు. దాంతో.. వికెట్ పడింది. ప్రస్తుతం జస్టిన్ గ్రీవ్స్(69 నాటౌట్)జతగా కేసీ కార్టీ(4 నాటౌట్) ఆడుతున్నాడు. 22 ఓవర్లకు విండీస్ స్కోర్.. 142-1.
The visitors are off to a flying start! 🔥
Campbell 🤝 Greaves, a fifty apiece for the West Indies openers! 🔥
Follow #INDvsWI 1st ODI live: https://t.co/iPSjuGLPc4 pic.twitter.com/lLKCg5cUwY
— Cricinfo (@cricinfo) September 27, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

