Anganwadi Schools | హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో నేటి(బుధవారం) నుంచి హాఫ్ డే బడులు నడుపనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితారామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి ఈ నెల 30 వరకు సగం పూట బడులు నడుపనుండగా.. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు బడులు పనిచేస్తాయని ఉత్తర్వుల్లో సర్కార్ పేర్కొన్నది.
మే 1 నుంచి 31 వరకు అంగన్వాడీ పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వనున్నట్టు స్పష్టంచేసింది. వేసవి సెలవుల్లో అంగన్వాడీ సిబ్బంది టేక్ హోమ్ రేషన్(టీహెచ్ఆర్) పంపిణీ చేయాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు ‘చైల్డ్ సేఫ్టీ వీక్’, మే 25 నుంచి మే 30 వరకు జరిగే ‘వుమెన్ థీమ్ వీక్’ కార్యక్రమాల్లో అంగన్వాడీ సిబ్బంది పాల్గొనాలని సూచించింది.