Prabhas | టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన స్టైల్, స్వాగ్తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. అయితే ఈసారి తన సినిమా కోసం కాదు.. హీరో శర్వానంద్ నటిస్తున్న ‘బైకర్’ మూవీకి సపోర్ట్‌గా ముందుకొచ్చాడు. ఇటీవల విడుదలైన ఓ స్పెషల్ వీడియోలో ప్రభాస్ మాస్ ఎంట్రీతో అభిమానులను ఆకట్టుకున్నాడు. ‘‘శర్వా మా ఇంటి హీరో.. ప్రమోద్, వంశీ నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్’’ అంటూ ఆయన వాయిస్ వినిపిస్తుండగా, స్టైలిష్‌గా బైక్ దగ్గరకు వచ్చి కవర్ తొలగించడం వీడియోలో హైలైట్‌గా నిలిచింది. వెంటనే ‘‘ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్… లెట్స్ రేస్’’ అంటూ చెప్పిన డైలాగ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అభిమానులు మిర్చి సినిమాలో కనిపించిన ప్రభాస్ స్టైల్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఇక హీరో శర్వానంద్ తనకు ఇచ్చిన ఈ సపోర్ట్‌పై భావోద్వేగంగా స్పందించాడు. ‘‘థ్యాంక్ యూ ప్రభాస్ అన్న… లవ్ యూ. మీరు ఎప్పుడూ నా కోసం నిలబడ్డారు. మన బంధం నాకు ఎంతో విలువైనది’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలాగే ట్రైలర్ చూసి కొన్ని నమ్మేయాలి… ఇండియాలో తొలి మోటోక్రాస్ ఫిల్మ్‌ను థియేటర్లలో అద్భుతంగా అనుభవించండి అంటూ ప్రేక్షకులను ఆహ్వానించాడు. ‘బైకర్’ సినిమా ఇండియాలో తొలి మోటోక్రాస్ నేపథ్యంతో రూపొందుతున్న చిత్రంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. బైక్ రేసింగ్‌తో పాటు తండ్రీకొడుకుల భావోద్వేగ బంధం చుట్టూ కథ సాగనుంది.
ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్గా మాళవిక నాయర్ నటిస్తోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా, అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.భారీ అంచనాల మధ్య ‘బైకర్’ సినిమా ఏప్రిల్ 3న తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.ఏది ఏమైన స్టార్ హీరోల మధ్య ఉన్న స్నేహం, సపోర్ట్‌కు ఇది మంచి ఉదాహరణ. ప్రభాస్ చేసిన ఈ స్పెషల్ వీడియో ‘బైకర్’ మూవీకి మంచి హైప్ తీసుకువచ్చి, ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.
Thank you, Prabhas Anna. Love you 🫂
You’ve always been there for me. Our bond is something I’ll always cherish.Yes… trailer chusi konni nammeyali 😉
Experience 𝐈𝐍𝐃𝐈𝐀’𝐒 𝐅𝐈𝐑𝐒𝐓 𝐌𝐎𝐓𝐎𝐂𝐑𝐎𝐒𝐒 𝐅𝐈𝐋𝐌 in Dolby Cinema, EPIQ, 4DX and PCX.#Biker Grand release on… pic.twitter.com/R4efg8BUi7
— Sharwanand (@ImSharwanand) March 31, 2026