భూపాలపల్లి: జయశకర్ భూపాలపల్లి జిల్లా కాటారం టోల్గేట్ వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జాతీయ రహదారిపై కారు, ఆటో ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు దవాఖానకు తరలించారు.
మృతులు విష్ణు (17), రజిత (28)గా గుర్తించారు. బాధితులు భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్పాకకు చెందినవారని వెల్లడించారు. సరస్వతి పుష్కరాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.