తుంగతుర్తి, మార్చి 12 : ఆశా కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆశా వర్కర్ల సంఘం తుంగతుర్తి మండల అధ్యక్షురాలు జయమ్మ కోరారు. గురువారం తుంగతుర్తి మండలం వెంపటిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఆశా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆశా కార్యకర్తలకు రూ.18 వేలు ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదన్నారు. జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నామని, తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మేకాక జయమ్మ, రాజేశ్వరి, సుజాత, యాకలక్మి, వెంకట లక్మి, నిలమ్మ, శోభ, కళమ్మ పాల్గొన్నారు.