ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ : తాటికొండ సీతయ్య
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బి ఫామ్‌తో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..
తుంగతుర్తి, మార్చి 12 : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బి ఫామ్‌తో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారికి క్లీన్ చీట్ ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అనంతరం లోక్ సభ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విషయం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి చరిత్ర హీనమైన తీర్పులు ఇవ్వడం సరికాదని ఆయన మండిపడ్డారు. స్పీకర్ తీర్పు పై మరోసారి ఉన్నత న్యాయ స్థానాల్లో తమ పార్టీ నాయకత్వం సవాల్ చేస్తుందని తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

