BRS Leader | శివ్వంపేట, మార్చి 12 : శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లి గ్రామంలో రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపాడనే కారణంతో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కొంతాన్‌పల్లి మాజీ ఎంపీటీసీ భర్త ఆకుల శ్రీనివాస్‌పై కాంగ్రెస్ నాయకులు పీఏసీఎస్ మాజీ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి, టేకులపల్లి రవీందర్ రెడ్డి, కలకంటి వెంకటేష్ ముగ్గురు కలిసి దాడి చేసిన ఘటన కలకలం రేపింది.
బాధితుడు ఆకుల శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ముగ్గురు కాంగ్రెస్ నేతలు కారులో అక్కడికి వచ్చి తనపై దురుసుగా మాట్లాడి.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని బెదిరించి ఒక్కసారిగా దాడి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా తన మెడలో ఉన్న తువాలును గట్టిగా మెడకు చుట్టి కొట్టి తన కారును తీసుకెళ్లారని ఆరోపించారు. రాజకీయంగా బీఆర్ఎస్కు మద్దతు తెలిపాననే కారణంతోనే తనపై దాడి జరిగిందని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆకుల శ్రీనివాస్ స్థానిక పోలీస్ స్టేషన్లో ముగ్గురు కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన తన అనుచరులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. అధికార పార్టీ నేతలు తమ ప్రభావాన్ని ఉపయోగించి ప్రతిపక్ష నాయకులను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన పార్టీకి మద్దతు తెలిపే హక్కు ఉందని, దాన్ని అణగదొక్కే ప్రయత్నాలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలను పోలీసులు కఠినంగా అరికట్టాలని, దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు.
Odisha | మద్యం మత్తులో దారుణం.. కుటుంబ కలహాలతో భార్య, కోడలు, మనవరాలి హత్య
Jasveer Singh | ముందుగా రూ.28 లక్షలకు ఒకే చెప్పిన టెకీ.. ఆపై రూ.36 లక్షలిస్తేనే చేరుతానని మెలిక..!