T20 World Cup : పొట్టి ప్రపంచకప్‌లో సెమీస్ రేసు ఉత్కంఠ రేపుతోంది. గ్రూప్ ‘ఏ’ నుంచి భారత్(India), గ్రూప్ ‘బీ’ నుంచి పాకిస్థాన్(Pakistan) రెండో బెర్తు కోసం కాచుకొని ఉన్నాయి. ఒక జట్టు ఓటమి మరో జట్టుకు అవకాశం అన్నట్టుగా.. చివరి నాకౌట్ పోరులో న్యూజిలాండ్ ఓటమి పాకిస్థాన్‌కు కలిసొచ్చింది. ఈ పరిస్థితుల్లో శ్రీలంక(Srilanka)తో చావోరేవో తేల్చుకునేందుకు పాక్ సిద్ధమైంది. అయితే.. ఆతిథ్య జట్టును ఓడించినంత మాత్రాన సెమీస్ బెర్తు ఖరారైపోదు. కివీస్ నెట్ రన్‌రేటును దాటితేనే సల్మాన్ అఘా బృందం ముందంజ వేస్తుంది. ఆ లెక్కేంటో తెలుసుకుందాం.
టీ20 వరల్డ్‌కప్‌లో నాకౌట్ దశ రసవత్తరంగా సాగుతోంది. వరుసగా రెండు విజయాలతో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్‌కు దూసుకెళ్లగా.. దాయాదులు భారత్, పాకిస్థాన్ మాత్రం చివరి మ్యాచ్‌పైనే ఆశలు పెట్టుకున్నాయి. డూ ఆర్ డై మ్యాచ్‌లో పాక్ జట్టు శనివారం పల్లెకెలె స్టేడియంలో శ్రీలంకను ఢీ కొడుతోంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే పాకిస్థాన్ సెమీస్ ఆశలు నిలుస్తాయి. ఎందుకుంటే.. ఇంగ్లండ్‌ను నిలువరించేందుకు కడదాక పోరాడి ఓడిన న్యూజిలాండ్ మూడు పాయింట్లు, +1.791 రన్‌రేటుతో మూడో స్థానంలో ఉంది.
🇵🇰 fans, from 0 to 100%, how confident are you about the team making the semi-finals? #T20WorldCup pic.twitter.com/AUTI6Lk0mz
— ESPNcricinfo (@ESPNcricinfo) February 28, 2026
కివీస్ మ్యాచ్ రద్దవ్వడం, ఇంగ్లండ్ చేతిలో చిత్తవ్వడం కారణంగా పాక్ ఖాతాలో ఒకేఒక పాయింట్.. రన్ రేటు -0.461గా ఉంది. ఈ నేపథ్యంలో సెమీస్ చేరాలంటే సల్మాన్ అఘా సేన గొప్పగా పోరాడాలి. ఒకవేళ మొదట బ్యాటింగ్ చేస్తే.. 103-150 రన్స్ చేయాలి. అప్పుడు 63కు పైగా పరుగులతో లంకను ఓడించాలి. లేదంటే.. 151-198 రన్స్ కొడితే.. 64 పరుగుల తేడాతో గెలుపొందాలి. ఛేజింగ్ చేయాల్సి వస్తే.. 153-163 మధ్య పరుగుల లక్ష్యాన్ని 13.2 ఓవర్లలో అందుకోవాలి. ఒకవేళ శ్రీలంక 176-186 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే 13.4 ఓవరల్లో పాక్ మ్యాచ్‌ను ముగించాల్సి ఉంటుంది. ఇవేవీ సాధ్యపడకుండా గెలిచామా అన్నట్టు గెలిస్తే మాత్రం మెరుగైన రన్‌రేటు కలిగిన కివీస్ సెమీస్‌కు దూసుకెళ్తుంది.
The last time Sri Lanka and Pakistan faced each other in #T20WorldCup, Pakistan failed to chase 139 in the first Semi Final.
They will meet each other again for the first time in 14 years in an all important match.#SLvPAK | #Cricket | #GreenTeam | #OurGameOurPassion pic.twitter.com/I31eL91Rod
— Green Team (@GreenTeam1992) February 28, 2026
ఈ పరిస్థితుల్లో ఓపెనర్లు ఫర్హాన్, సయీం, బాబర్ ఆజాం, ఉస్మాన్ ఖాన్లు చెలరేగాలి. ఇంగ్లండ్‌పై మూడు వికెట్లతో మెరిసిన షాహీన్ అఫ్రిది పవర్ ప్లేలోనే లంకను ఇరుకున పెడితే పాక్ జట్టుకు అవకాశాలు ఉంటాయి. కానీ, సొంతగడ్డపై దారుణ ప్రదర్శనతో సెమీస్‌కు దూరమైన లంక.. విజయంతో వీడ్కోలు పలికాలనే కసితో ఉంది. సో.. పరువు కోసం ఆడుతున్న దసున్ శనక సేన పాకిస్థాన్‌కు అంత తేలికగా తలవంచకపోవచ్చు.