చిలిపిచెడ్, ఆగస్టు 17: యూరియా కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ రైతువేదికలో ఎంపీడీవో ప్రశాంత్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. యూరియా యాప్, ఇందిరమ్మ ఇండ్లు, మిషన్ భగీరథ నీరు, విద్యు త్ సమస్యలపై చర్చించారు. ఈ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా కోసం యాప్ తీసుకువచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు.
యాప్‌తో సంబంధం లేకుండా యూరియా, ఇతర ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. మండలంలో యూరియా లేక నారాయణఖేడ్, వట్టిపల్లి, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట్, టేక్మాల్ తదితర మండలాలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ముందు సోమక్కపేట కాంగ్రెస్ సర్పంచుచ్ బెస్త దుర్గాచలం,చండూర్ సర్పంచ్ దాసరి శేషాద్రి, గౌతాపూర్,చిలిపిచెడ్ సర్పంచ్‌లు బలవంత్‌రెడ్డి, అనిల్ లోవోల్టేజీ, నిరంతర విద్యుత్ దీపాలు వెలుగడంపై మండల విద్యుత్ ఏఈని నిలదీశారు.
మండల కేంద్రంలో బ్యాంక్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు మండల ఏపీఎం గౌరీశంకర్ కోరారు. చిలిపిచెడ్‌లో రెవెన్యూ కార్యాలయ భవనం నిర్మించాలని ఆగ్రామ సర్పం చ్ అనిల్,సోమక్కపేట సర్పంచ్ దుర్గాచలం శీలాంపల్లి రైతువేదిక వద్ద అని, చండూర్ గ్రామ శివారులో భవనం నిర్మించాలని ఎమ్మెల్యే ముందు వారి అభిప్రాయాలు తెలి
యజేశారు. బద్రియ తండాలో ఓ రైతు మట్టి రోడ్డు వేయకుండా అడ్డుకుంటున్నాడని ఆ తండా సర్పంచ్ కున్యనాయక్ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే స్పందించి తహసీల్దార్‌కు ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివప్రసాద్, హౌసింగ్ ఏడీ ప్రసన్న, పీఏసీఎస్ చైర్మన్ ధర్మారెడ్డి, మండల అధికారులు, సర్పంచ్‌లు, కార్యదర్శులు పాల్గొన్నారు.