హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక స మగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో కీలకమైన ఎన్యుమరేషన్ దశ పూర్తయింది. జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించిన ఎన్యుమరేషన్ ప్రక్రియలో రాష్ట్రంలోని మొత్తం 3,38,26,4 48 మంది ఓటర్లలో 2,64,87,213 మంది (78.30%) ఫామ్‌లను సమర్పించినట్టు తేలింది. ఈ వివరాలతో ముసాయిదా ఓటరు జాబితాను సోమవారం రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంబంధిత ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్వోలు) ప్రచురించారు. బీఆర్కే భవన్‌లోని తన కార్యాలయం లో సోమవారం మీడియాకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. అనామలిస్ జాబితాలో ఉన్న 60.50 లక్షల మంది, అన్మ్యాప్డ్గా గు ర్తించిన 32 లక్షల మంది.. మొత్తం 92 లక్షల మందికి నోటీసులు జారీచేయనున్నట్టు చెప్పా రు. అబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ (ఏఎస్‌డీడీ) జాబితాలో 73 లక్షల మంది ఉన్నారని తెలిపారు.
9,22,229 మంది (2.73%) మృతి చెందినవారిగా, 57,46,803 మంది (16.99%) శాశ్వతంగా తరలివెళ్లిన/అందుబాటులో లేని ఇతర క్యాటగిరీలుగా, 6,70,203 మంది (1.98%) ఒకటి కంటే ఎకువ ప్రాం తాల్లో ఓటర్ల జాబితాలో నమోదైనవారిగా గు ర్తించినట్టు పేర్కొన్నారు. ఎన్యుమరేషన్ ఫామ్ లు సమర్పించిన 2.64 లక్షల మందిలో 1.72 లక్షల మంది మాత్రమే ఫామ్‌లను సక్రమంగా నింపారని వెల్లడించారు. బీఎల్వోలు గుర్తించలేకపోయిన లేదా ఎన్యుమరేషన్ ఫామ్‌లు తిరిగి ఇవ్వనివారిలో ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్లుగా మారినవారు, ఉనికిలో లేని వ్యక్తులు, వి విధ కారణాలతో ఓటరుగా నమోదు కావడాని కి ఆసక్తి చూపనివారు ఉన్నట్టు తెలిపారు. వీరిలో అర్హులైన ఓటర్లకు మళ్లీ జాబితాలో చేరే అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. అర్హులు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు జరిగే క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ ప్రక్రియలో ఫామ్-6తో పాటు నిర్దేశిత డిక్లరేషన్ ఫామ్ సమర్పించి ఓటరు జాబితాలో పేరు చేర్చుకోవచ్చని సూ చించారు. ఒకటి కంటే ఎకువచోట్ల నమోదైన ఓటర్ల పేర్లను మాత్రం ఒకేచోట కొనసాగించనున్నట్టు స్పష్టంచేశారు.
‘సర్’ ప్రక్రియలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 మంది జిల్లా ఎన్నికల అధికారులు(డీఈవోలు), 119 ఈఆర్వోలు, 892 ఏఈఆర్వోలు, 3,590 బీఎల్వో సూపర్వైజర్లు, 35,985 మంది బీఎల్వోలు పనిచేశారని సీఈ వో సుదర్శన్‌రెడ్డి చెప్పారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన 49,018 బీఎల్ఏలు కూడా పాల్గొన్నారని తెలిపారు. ఒకో పోలింగ్ కేంద్రంలో 1,200 మందికి మించకుండా ఓటర్లు ఉండేలా పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 35,985 నుంచి 36,353కు పెరిగిందని, అంటే 368 కేంద్రాలు అదనంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఓటర్లకు సహాయం చేసేందుకు హెల్ప్ డెస్‌లు పెట్టిన ట్టు తెలిపారు. 1950 ఓటర్ హెల్ప్‌లైన్‌ను అందుబాటులో ఉంచామని, వెబ్సైట్లో ‘సర్’కు ప్రత్యేక వెబ్ పేజీతోపాటు 2002 నాటి గత ‘సర్’ వివరాలను పొందేందుకు శోధించగలిగే పీడీఎఫ్ ఓటరు జాబితాను కూడా అందుబాటులో ఉంచినట్టు వివరించారు. 2026 అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారికి ఓటరు జాబితాలో పేరు చేర్చుకునేందుకు ఫామ్-6తోపాటు నిర్దేశిత డిక్లరేషన్ సమర్పించాలని సీఈవో సూచించారు.
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముసాయిదా ఓటరు జాబితాను ఈఆర్వోలు ప్రచురించినట్టు సీఈవో చెప్పారు. ముసాయిదా జాబితాలో పేర్లు లేని గైర్హాజరు, తరలిపోయిన, మరణించిన, డూప్లికేట్ ఓటర్ల బూత్‌వారీ జాబితాలను సంబంధిత ఈఆర్వో/ఏఈఆర్వో కార్యాలయాలు, గ్రామపంచాయతీ/మున్సిపల్ కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాల నోటీసు బోర్డులపై ప్రదర్శించినట్టు వెల్లడించారు. ఆయా జాబితాలను సీఈవో, డీఈవో వెబ్సైట్లలోనూ అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ప్రజలు, ఓటర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈఆర్వో, ఏఈఆర్వో కార్యాలయాలు, బీఎల్వోల వద్ద ముసాయిదా ఫొటో ఓటరు జాబితాలను పరిశీలించవచ్చని పేర్కొన్నారు. సీఈవో తెలంగాణ వెబ్సైట్, ఈసీఐనెట్ మొబైల్ యాప్, ఎన్నికల సంఘం ఓటర్ పోర్టల్ ద్వారా కూడా జాబితాలను పరిశీలించే అవకాశం ఉన్నదని వివరించారు. జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించి క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ షెడ్యూల్‌ను వివరించినట్టు తెలిపారు.
క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ సమయంలో ప్రధానంగా నాలుగు రకాల ఫామ్‌లను ఓటర్లు ఉపయోగించవచ్చని సీఈవో సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. కొత్త ఓటరుగా నమోదు కోసం ఫామ్-6, విదేశాల్లో నివసించే భారతీయుల ఓటరు నమోదు కోసం ఫామ్-6ఏ, ప్రతిపాదిత చేర్పుపై అభ్యంతరం లేదా ఇప్పటికే ఉన్న పేరును తొలగించేందుకు ఫామ్-7, నియోజకవర్గం లోపల/బయట నివాస మార్పు, వివరాల సవరణ, మార్పుల్లేకుండా ఎపిక్ కార్డు స్థానంలో కొత్త కార్డు, దివ్యాంగ ఓటరుగా గుర్తింపు తదితరాల కోసం ఫామ్-8 ఉపయోగించాలని సూచించారు. దరఖాస్తులను ఈఆర్వోలు, ఏఈఆర్వోలు పరిశీలిస్తారని తెలిపారు. భౌతికంగా ఈఆర్వో, ఏఈఆర్వో, బీఎల్వోలకు ఫామ్‌లు ఇవ్వడంతోపాటు ఆన్లైన్లో voters.eci.gov.in, ఈసీఐనెట్ మొబైల్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్కు సంబంధించిన ఫామ్‌లు 9, 10, 11, 11A, 11బీ జాబితాలను సీఈవో తెలంగాణ వెబ్సైట్లో పెట్టినట్టు తెలిపారు. సంబంధిత ఈఆర్వోలు ఆ జాబితాలను రాజకీయ పార్టీలకు వారానికి ఒకసారి అందజేస్తారని పేర్కొన్నారు.
ముసాయిదా జాబితా ప్రచురణ అనంతరం ఈఆర్వోలు ఓటర్ల అర్హతను పరిశీలిస్తారని సీఈవో చెప్పారు. గత ‘సర్’ ఓటరు జాబితాతో లింక్ కాకపోయినా లేదా లింకింగ్‌లో తేడాలు ఉన్నవారికి ఈఆర్వో నోటీసులు జారీ చేస్తారని పేర్కొన్నారు. నోటీసు అందుకున్నవారు విచారణ సమయంలో ఎన్యుమరేషన్ ఫామ్ వెనుక పేరొన్న జాబితా ప్రకారం అవసరమైన పత్రాలను సమర్పించాని సూచించారు. నోటీసులు అందుకున్నవారి జాబితాలను గ్రామపంచాయతీ/మున్సిపల్ కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాలు, డీఈవో వెబ్సైట్లలో ప్రదర్శించామని తెలిపారు.
ముసాయిదా ఓటరు జాబితాలో ఉన్న ఏ పేరునైనా నేరుగా తొలగించరాదని సీఈవో స్పష్టం చేశారు. నోటీసు జారీ, విచారణ, సంబంధిత వ్యక్తికి సముచితమైన అవకాశం కల్పించిన తర్వాతే తొలగింపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రతి కేసులో ఈఆర్వో/ఏఈఆర్వో కారణాలను నమోదు చేస్తూ ‘స్పీకింగ్ ఆర్డర్’ జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఈఆర్వో నిర్ణయంతో ఎవరైనా అసంతృప్తి చెందితే ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 24(a), రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలెక్టర్స్ రూల్స్, 1960లోని రూల్ 27 ప్రకారం జిల్లా మెజిస్ట్రేట్/డీఈవో వద్ద 15 రోజుల్లోపు మొదటి అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. ఆ నిర్ణయంతో కూడా సంతృప్తి లేకపోతే, డీఈవో ఉత్తర్వుల తేదీ నుంచి 30 రోజుల్లోపు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 24(బి), రూల్ 27 ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వద్ద రెండో అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పౌరుడు కూడా ఓటరు జాబితా నుంచి తప్పిపోకుండా, అనర్హులు జాబితాలో చేరకుండా ‘సర్’ ప్రక్రియను పారదర్శకంగా, సమగ్రంగా నిర్వహించేందుకు తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.

ఎన్యుమరేషన్ దశలో ఓటర్ల నుంచి 2.65 కోట్ల ఈఎఫ్‌లు సేకరించినట్టు సీఈవో సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. ఇది రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 78.30 శాతమని తెలిపారు. జూన్ 25 నుంచి ఆగస్టు 10 వర కు నిర్వహించిన ఎన్యుమరేషన్ దశ విజయవంతంగా పూర్తయిందని అన్నారు. ‘సర్’ ప్రక్రియపై తన కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం సీఈవో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు చేపట్టిన ప్రక్రియ, వెల్లడైన వివరాలు, ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలన, తదుపరి క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమగ్రంగా వివరించారు. సోమవారం ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించినట్టు చెప్పారు.

క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ ప్రక్రియ ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు కొనసాగుతుందని వివరించారు. ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చడం, వివరాల్లో తప్పులను సరిచేయడం, అర్హతలేని పేర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం వంటి అంశాలకు అవకాశం ఉంటుందని వివరించారు. పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు సీఈవో సమాధానాలు ఇచ్చారు. సమావేశంలో రాజకీయ పార్టీల నుంచి వచ్చిన సూచనలను స్వీకరించి, వాటిని పరిశీలిస్తామని ఆయన తెలిపారు. సమావేశం అనంతరం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముసాయిదా ఓటర్ల జాబితాల హార్డ్డిస్లను అందజేశారు. ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలనతోపాటు క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ ప్రక్రియలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు చురుగ్గా పాల్గొనాలని కోరారు.
