చిలిపిచెడ్, ఆగస్టు 17: పేదింటి ఆడబిడ్డల కష్టాలు చూసిన కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి ఎంతోమంది కుటుంబాలకు అండగా నిలిచారని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా చిలిపిచెడ్లోని తహసీల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె ధర్నా చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి అవగాహన లేక ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలపై స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. పథకాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ హైకోర్టులో కేసు వేస్తే ప్రభు త్వం సమస్యను పరిష్కరించకుండా జాప్యం చేస్తోందని విమర్శించారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే నిర్ణయాలు తెలియజేయాలని స్పష్టం చేయాలన్నారు. సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ధర్మారెడ్డి,మండలాధ్యక్షుడు అశోక్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు అనిల్, బలవంత్‌రెడ్డి, స్రవం తి, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, సంగగౌడ్, కిషన్‌రెడ్డి, మాణిక్యరెడ్డి, విఠల్, బీమయ్య, వెంకట్‌రెడ్డి, పోచయ్య పాల్గొన్నారు.