Gulveer Singh : పద్దెనిమిదో ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్(Gulveer Singh ) అదరగొడుతున్నాడు. ఇప్పటికే రెండు విభాగాల్లో పోడియంపై నిలుస్తున్న ఈ మారథాన్ రన్నర్.. హ్యాట్రిక్ మెడల్ సాధించాడు. నగోయలో మంగళవారం నిర్వహించిన పురుషుల 5000మీ ఫైనల్లో కాంస్యంతో మెరిశాడు గుల్వీర్. తద్వారా అథ్లెటిక్స్ దిగ్గజం పీటీ ఉష(PT Usha) అనంతరం ఒకే ఎడిషన్‌లో మూడు మెడల్స్ పట్టేసిన భారత రెండో అథ్లెట్‌గా గుల్వీర్ చరిత్ర సృష్టించాడు.
జపాన్ ఆతిథ్యమిస్తున్న ఆసియా క్రీడల్లో గుల్వీర్ సింగ్ హవా కొనసాగుతోంది. పోటీపడిన ప్రతి విభాగంలో పతకాలతో మెరుస్తున్న గుల్వీర్ ఈసారి 5వేల మీటర్ల పరుగులోనూ విజేతగా నిలిచాడు. మంగళవారం జరిగిన ఫైనల్లో సత్తా చాటిన అతడు మూడో స్థానంతో కాంస్యం గెలుపొందాడు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో భారత అథ్లెట్ 13:32.75 టైమింగ్‌తో లక్ష్యాన్ని చేరుకున్నాడు.
WATCH HISTORY IN THE MAKING.
🇮🇳 GULVEER SINGH IS AN INSPIRATION TO MILLIONS OF ATHLETES.
THREE RACES. THREE MEDALS.
🥈 10,000m — 28:29.38
🥈 1500m — 3:36.72 PB
🥉 5000m — 13:32.75From 1500m to 10,000m, Gulveer has finished on the podium in EVERY DISTANCE he raced in Nagoya.…
— nnis Sports|Asian GamesAthletics (@nnis_sports) September 29, 2026
భారత అథ్లెటిక్స్‌లో ఆశాకిరణంగా మారిన గుల్వీర్ 1,500మీ, 10వేల మీటర్లలో వెండి పతకాలతో మురిశాడు. ఈసారి 5వేల మీ పరుగులో కంచుమోతతో భారతావనిని సంబురాల్లో ముంచెత్తాడు. ఆసియాడ్ ఒకే ఎడిషన్‌లో మూడేసి పతకాలు సాధించిన రెండో భారత అథ్లెట్‌గా అతడు మరో రికార్డు సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతం భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఉన్న పీటీ ఉష 1986 సియోల్ ఎడిషన్‌లో ఏకంగా ఐదు పతకాలు గెలిచింది. 200మీ, 400మీ, 400మీ హర్డిల్స్, 4×400మీ రీలేలో స్వర్ణం సాధించిన తను.. 4×400 రీలేలో వెండి వెలుగులు విరజిమ్మింది. 1990 బీజింగ్ ఎడిషన్‌లోనూ జోరు చూపించిన ఉష.. దేశానికి మూడు సిల్వర్ మెడల్స్ అందించింది.