న్యూశాయంపేట, మే 22: దీక్షలతో మానసిక ఆనందం కలుగుతుంద ని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ అన్నారు. గ్రేటర్ పరిధిలోని 31వ డివిజన్ న్యూశాయంపేట బస్టాండ్ సమీపంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ దీక్ష కుటీరం స్వాముల ఆధ్వర్యంలో గురువారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి, మహా అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నారని, హనుమాన్ దీక్ష కఠినమైందన్నారు. దేవుళ్ల దీక్షలతో ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉంటుందన్ని అన్నారు. శ్రీ భక్తాంజనేయ ఆలయ ఏర్పాటు నుంచి గత మూడు ఏండ్లుగా హనుమాన్ మాల ధారణ స్వాములకు 41 రోజుల పాటు నిత్యం అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న మాడిశెట్టి శ్యామ్, వెనుకంటి యాదగిరి లను ఆయన శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెనుకంటి సారంగపాణి- విజయ దంపతులు, వేల్పుల వేణుగోపాల్, ఏనుగుల రాంప్రసాద్, రాజేష్, శివ, సురేందర్ రెడ్డి, రమేష్, యాదగిరి, చిరంజీవి, తదితరులతో పాటు హనుమాన్ దీక్ష స్వాములు భక్తులు పాల్గొన్నారు.