Gandhi Talks | వైవిధ్యభరితమైన పాత్రలతో మెప్పించే తమిళ నటులు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన మూకీ చిత్రం ‘గాంధీ టాక్స్’ (Gandhi Talks). కిశోర్ పాండురంగ్ బెలెకర్ దర్శకత్వం వహించాడు. ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేయబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, మార్చి 6, 2026 నుండి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఇది డైలాగులు లేని సినిమా అయినప్పటికీ, మ్యూజిక్ మరియు టైటిల్ కార్డ్స్ పరంగా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వీక్షకులకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘రెంటల్’ పద్ధతిలో సుమారు రూ.279 చెల్లించి చూడాల్సి ఉండగా, మార్చి 6 నుండి జీ5 చందాదారులు ఎటువంటి అదనపు రుసుము లేకుండా ఉచితంగా వీక్షించవచ్చు.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. మాటలు లేని ఈ సినిమాలో సంగీతమే ప్రధాన బలంగా నిలిచింది. ఒక నిరుద్యోగి తన లక్ష్యాలను చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు, ఆ ప్రయాణంలో అతనికి ఎదురయ్యే విభిన్న వ్యక్తులు మరియు పరిస్థితుల చుట్టూ ఈ కథాంశం సాగుతుంది. ఇందులో అదితి రావు హైదరి, సిద్ధార్థ్ జాదవ్ కీలక పాత్రలు పోషించారు. కమల్ హాసన్ నటించిన క్లాసిక్ చిత్రం ‘పుష్పక విమానం’ తర్వాత చాలా కాలానికి వస్తున్న పూర్తి స్థాయి మూకీ చిత్రం కావడంతో, సినీ ప్రియుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
A film that speaks without a single word..🔇#GandhiTalks Premieres On March 6th On ZEE5❤️@VijaySethuOffl @thearvindswami @aditiraohydari @arrahman @SIDDHARTH23OCT @kishorbelekar #UmeshKrBansal @rajeshkejriwal @MeerraChopra @Romeopictures_ @mynameisraahul @Kyoorius… pic.twitter.com/QxA8KitUtw
— ZEE5 Tamil (@ZEE5Tamil) February 28, 2026