కట్టంగూర్, ఫిబ్రవరి 28 : కట్టంగూర్ మండలంలోని ఈదులూరు ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థినులు ఎం.రక్షర. ఏ.చైత్రిక, ఏ.హారిక నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్ఎంఎంఎస్)కు ఎంపికయ్యారు. ముగ్గురు విద్యార్థినులకు సంవత్సరానికి రూ.12 వేల చొప్పున నాలుగు సంవత్సరాల పాటు ఉపకార వేతనం అందనుంది. వారి ప్రతిభ, కృషి పట్టుదల ఫలితంగా ఈ విజయాన్ని సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.నర్సిరెడ్డి తెలిపారు. ప్రధానోపాధ్యాయులుతో పాటు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్లు విద్యార్థినులను అభినందించారు. భవిష్యత్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.