ప్రముఖ నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న పిల్లల సినిమా ‘సమ్మర్ హాలిడేస్’. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే కథాంశంతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్న ఈచిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలకపాత్రధారులు. త్వరలోనే సినిమా విడుదల కానున్నది. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఊరి కాలువలో సరదాగా ఆడుకుంటున్న మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్‌లను ఈ పోస్టర్లో చూడొచ్చు.
ప్రతి ఒక్కరికీ తమ ప్రాణస్నేహితులను గుర్తు చేసేలా వీరిద్దరి పాత్రలు ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, వర్షిణి, హర్షవర్థన్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సాయి ప్రకాశ్, సంగీతం: సింజిత్ యెర్రమల్లి.