నిరుపేద బిడ్డకు అండగా..
“హరీశ్‌రావు ఓ మానవత్వ శిఖరం.. ఆపదలో ఆదుకొనే ఆపద్బాంధవుడు... కష్టాల్లో ఉన్న వారికి అన్నలా అండగా ఆత్మీయత ఇచ్చే నాయకుడు.. సిద్దిపేట కుటుంబ సభ్యుడిగా నిత్యం ప్రజల కష్టాలు, బాధలు తీర్చే హరీశ్‌రావు... వైద్య విద్యను అభ్యసించేందుకు ఆర్థిక స్థోమత లేక ఆందోళనలో ఉన్న అఖిల వైద్య విద్యకు అభయం ఇచ్చాడు. అఖిల డాక్టర్ అయ్యేంత వరకు నా బాధ్యత.. నువు సీటు సాధించు వైద్య విద్యకయ్యే ఫీజు మొత్తం భరిస్తా... నిన్ను చదివించే బాధ్యత నాది” అంటూ భరోసా ఇచ్చి మరో సారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు.
- ఇంటికి పిలిచి అన్నం పెట్టి ఆత్మీయ భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు
- మరోసారి మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి
- విద్యార్థిని అఖిల వైద్య విద్యకు అభయం
“హరీశ్‌రావు ఓ మానవత్వ శిఖరం.. ఆపదలో ఆదుకొనే ఆపద్బాంధవుడు… కష్టాల్లో ఉన్న వారికి అన్నలా అండగా ఆత్మీయత ఇచ్చే నాయకుడు.. సిద్దిపేట కుటుంబ సభ్యుడిగా నిత్యం ప్రజల కష్టాలు, బాధలు తీర్చే హరీశ్‌రావు… వైద్య విద్యను అభ్యసించేందుకు ఆర్థిక స్థోమత లేక ఆందోళనలో ఉన్న అఖిల వైద్య విద్యకు అభయం ఇచ్చాడు. అఖిల డాక్టర్ అయ్యేంత వరకు నా బాధ్యత.. నువు సీటు సాధించు వైద్య విద్యకయ్యే ఫీజు మొత్తం భరిస్తా… నిన్ను చదివించే బాధ్యత నాది” అంటూ భరోసా ఇచ్చి మరో సారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు.
సిద్దిపేట, ఆగస్టు 2: సిద్దిపేట జిల్లా చెందిన మద్దూరి రాజు పట్టణంలో హోటల్ని కొన్నేండ్లు నడిపించాడు. దురదృష్టవశాత్తు బ్రెయిన్ క్యాన్సర్‌తో విధి వక్రీకరించి చనిపోయాడు. ఇంటి పెద్ద దికును కోల్పోయిన భార్య, ముగ్గురు ఆడపిల్లలు రోడ్డున పడ్డారు.. తండ్రిని కోల్పోయిన పిల్లలకు, కుటుంబానికి ఆర్థిక పరిస్థితి భారంగా మారింది. పిల్లల్ని ఎలా చదివించాలి అనే ఆందోళనలో తల్లి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును కలిసి వారి పరిస్థితి వివరించి సహాయం చేయాలని కోరారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే హరీశ్‌రావు వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పించారు.
పిల్లల్ని చదివించే బాధ్యత నాది అని వారికి భరోసా కల్పించారు. ప్రస్తుతం పెద్ద కూతురు కావ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీటు సంపాదించి ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నది. అప్పటికే రెండో కూతురు అఖిల మెరిడియన్ సూల్లో చదువుతోంది. మంచి ప్రతిభ గల విద్యార్థిని ఆమెకు సరస్వతి అనుగ్రహం ఉంది కానీ.. లక్ష్మీకటాక్షం లేదు అని ఆందోళన ఉన్న సమయం లో హరీశ్‌రావును ఆశ్రయించారు. దీంతో తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు ఫీజు తానే కడతానని కళాశాల యాజమాన్యానికి హరీశ్‌రావు ఫోన్ చేసి చెప్పారు. చిన్న కూతురు దీపికను కూడా చదివిస్తానని భరోసా ఇచ్చారు.
సీటు సాధించు.. నేనే ఫీజు కట్టి చదివిస్తా
అఖిల చదువులో ప్రతిభ కనబరుస్తూ ఉత్తీర్ణత సాధిస్తూ సూల్, కాలేజీలో టాపర్‌గా నిలుస్తున్నది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో నీట్ పరీక్ష రాసింది. నీట్ పరీక్షలో 720 మారులకు 453 మారులు సాధించింది. మంచి కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం ఉంది. ఈ విష యం తెలుసుకున్న ఎమ్మెల్యే హరీశ్‌రావు విద్యార్థిని అఖిల, తల్లి రేణుకను తన ఇంటికి పిలిచి అన్నం పెట్టి “అఖిలా ఆందోళన వద్దు ఎంబీబీఎస్ సాధించాలనే నీ తపన.. కల నెరవేరుతున్నది.. నీకు సీటు ఎకడొచ్చినా మెడిసిన్ చదివించే బాధ్యత నాది” అని భరోసా ఇచ్చారు.
హరీశ్‌రావు హామీ.. ఉపాధ్యాయుల ప్రోత్సాహం
అఖిల తొమ్మిదో తరగతిలో మెరిడియన్ సూల్లో జాయిన్ అయ్యింది.. మొదటి నుంచి మెరిట్ స్టూడెంట్ కావడంతో ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. తండ్రిని కోల్పోవడంతో సూల్ ఫీజు ఇబ్బందిగా మారింది. హరీశ్‌రావుని కలవడంతో మెరిడియన్ విద్యా సంస్థ డైరెక్టర్ దేవేందర్‌రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫోన్ చేసి తండ్రిని కోల్పోయిన బిడ్డకు సహకారం అందించాలని, ఫీజు నా బాధ్యత అని చెప్పారు.. ఆ ఒక మాటతో అఖిలకు ఎలాంటి ఫీజు లేకుండా నాలుగేండ్లు ఉచితంగా చదువు చెప్పి ప్రోత్సహించారు. నేడు నీట్లో సీటు రావడంతో కుటుంబాన్ని నిలబెట్టిందని మెరిడియన్ విద్యా సంస్థను హరీశ్‌రావు అభినందించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

