చుంచుపల్లి: భారత రత్న డా.బాబాసాహెబ్ అంబేదర్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై ‘ఉపా’ (UAPA 1967) చట్టం కింద కేసు నమోదు చేయాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (JBP) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హమారా ప్రసాద్‌ను అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాకుండా, ఆయనపై ఉపా కేసు పెట్టాలని గురువారం చుంచుపల్లిలో నిర్వహించిన సమావేశంలో కామేశ్ స్పష్టం చేశారు.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు ఎదుర్కొంటున్న హమారా ప్రసాద్‌పై గతంలోనే పలుచోట్ల ఫిర్యాదులు వచ్చినప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ మండిపడ్డారు. గురువారం చుంచుపల్లిలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన.. ప్రసాద్‌ను అరెస్ట్ చేసినందున బెయిల్ రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయనపై ఉపా చట్టం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది? అని కామేష్ ప్రశ్నించారు. హమారా ప్రసాద్‌కు బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతు ఉందన్న తమ ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్, అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్, కిరణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.