Viral Video : నేపాల్లో దారుణ ఘటన జరిగింది. ఒక కుక్కను మహిళ బ్రిడ్జిపై నుంచి నదిలోకి తోసేసింది. దీంతో కుక్క నీళ్లలోపడి కొట్టుకుపోయింది. నేపాల్లోని సేటి గండకి నదిపై భఝంగ్ పంకోట్ బ్రిడ్జి వద్ద ఇటీవల జరిగింది. ఈ ఘటనను మరొకరు వీడియో తీయగా.. అదిప్పుడు వైరల్ అయింది. వీడియో ప్రకారం.. ఒక కుక్కను మహిళ బ్రిడ్జిపైకి తీసుకొచ్చింది.
ఆ కుక్కను బ్రిడ్జిపై నుంచి కింద వేగంగా ప్రవహిస్తున్న నదిలోకి తోసేయడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆ కుక్క బ్రిడ్జిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ ఆ మహిళ బలవంతంగా కుక్కను నదిలోకి తోసేసింది. దీంతో నది నీటిలో పడ్డ కుక్క పాపం నీటి నుంచి బయటపడటానికి ప్రయత్నించింది. అయినప్పటికీ నది నీటిలో పడి కొట్టుకుపోయింది. చివరగా ఆ కుక్క ఏమైంది అనే విషయంలో స్పష్టత లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. జంతు ప్రేమికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Horrible 😳
A woman reportedly threw her own dog into a river from a bridge in Nepal.
The incident is reported to have taken place at Pankot Bridge in Bajhang. She reportedly claimed the dog had bitten someone, though that claim has not been independently verified.
Absolutely… pic.twitter.com/zsc5SaRnPL
— Sinister (@UnapologeticRuh) September 17, 2026
మూగ జీవాన్ని నిర్ధాక్షిణ్యంగా నదిలోకి తోసేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మహిళను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ కుక్క కొందరిని కరవడం వల్ల కోపంతో ఆ మహిళ ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్పష్టత రావాల్సి ఉంది. నిందితురాలిపై త్వరగా చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.