KTR | కేటీఆర్ మానవీయ స్పందన.. నిమ్స్‌లో ఇద్దరు మహిళల వైద్యానికి రిఫరల్ లెటర్లు..!
ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 17: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) మరోసారి తన మానవతా దృక్ఫథాన్ని చాటుకున్నారు. నిమ్స్ (NIMS)లో చేరిన ఇద్దరు మహిళలు ఎల్వోసీ (LOC) కోసం అర్జీ పెట్టుకోగా తక్షణం స్పందించారు కేటీఆర్.
ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 17: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) మరోసారి తన మానవతా దృక్ఫథాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం హైద్రాబాద్‌లోని నిమ్స్(NIMS)లో చేరిన ఇద్దరు మహిళలు ఎల్వోసీ (LOC) కోసం అర్జీ పెట్టుకోగా తక్షణం స్పందించారు కేటీఆర్. వెంటనే వారి చికిత్సలకు రిఫరల్ లెటర్లు కేటీఆర్ అందించారని గురువారం బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు.
కాంగ్రెస్ వెయ్యి రోజుల అసమర్ధ పాలనను ఓవైపు ఎండగడుతూనే.. మరోవైపు ఎమ్మెల్యేగా తన ప్రాంత ప్రజలకు అండగా నిలుస్తున్నారు కేటీఆర్. వైద్యం కోసం నిమ్స్‌లో చేరిన ఇద్దరు మహిళల చికిత్స కోసం ఆయన రిఫరల్ లెటర్లు అందించారు. వివరాల్లోకి వెళితే.. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లికి చెందిన పాతూరి సుగుణ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. వైద్య చికిత్స కోసం ఆమె హైద్రాబాద్‌లోని నిమ్స్‌లో చేరింది. గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన గుగులోత్ లక్ష్మి కూడా నిమ్స్‌లోనే అడ్మిట్ అయింది.
తమ వైద్య చికిత్సల కోసం తమ ప్రాంత ఎమ్మెల్యే కేటీఆర్‌కు లక్ష్మి, సుగణలు తమ ఆర్థిక సమస్యపై సమాచారమిచ్చారు. వారి అభ్యర్థనపై వెంటనే స్పందించిన కేటీఆర్ వీరి చికిత్సకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి రిఫరల్ లెటర్ పంపారు. కేటీఆర్ చొరవతో సుగుణకు రూ.3.50లక్షలు మంజూరు కాగా.. గుగులోత్ లక్ష్మికి రూ.1.50 లక్షలు మంజూరయ్యాయి. దాంతో.. లక్ష్మికి మంజూరైన చెక్కును బీఆర్ఎస్ యూత్వింగ్ నాయకుడు భూక్యా గణేశ్ హాస్పిటల్లో ఆమెకు అందించారు. ఎల్వోసీ మంజూరు చేసినందుకు ఇరు కుటుంబాల సభ్యులు, బండలింగంపల్లి సర్పంచ్ బాల్‌రాజ్ నర్సాగౌడ్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- Guguloth Laxmi
- KTR
- loc
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

