హనుమకొండ: కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చివరికి సొంత పార్టీ కార్యకర్తలు సైతం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. తాజాగా ఐనవోలు మండలం కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో అర్హులైన కాంగ్రెస్ లబ్ధిదారులకు ఇండ్లు రాలేదంటూ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీశారు. నిజమైన అర్హులకు కాకుండా ఇండ్లు, భూములు ఉన్న వారికే మళ్లీ ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో పేరు రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నిజమైన లబ్ధిదారుల ఎంపిక కోసం రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Northeast Floods: ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు.. అస్సాం, సిక్కిం సీఎంలతో మాట్లాడిన ప్రధాని