Harish Rao | యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు.. అన్ని ఆధారాలు ఉన్నాయి. త్వరలో అన్ని బయట పెడుతానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ప్రభుత్వ పనితీరుపై హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. యంగ్ ఇండియా స్కూల్స్‌లో ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారో అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు రావడం లేదని.. మేము ప్రతిపక్షంగా సక్సెస్ అయ్యామని పేర్కొన్నారు.
ఖమ్మంకు కేటీఆర్ వెళ్లారు.. ఇప్పుడు స్థలాలు ఇస్తాం.. ఇండ్లు కట్టిస్తాం అన్నారు. నేను శారదా పీఠం వెళ్లాను.. అది ఆపుతున్నాం అన్నారు. దేవాదుల ప్రాజెక్టు వెళ్లాం. వెంటనే ముఖ్యమంత్రి కూడా వెళ్లారు. హెల్త్ సిటీకి వెళ్లాం… ప్రతి దానికి మేము వెళ్లాక స్పందిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. జర్నలిస్టుల హెల్త్ స్కీంను గాలికి వదిలేశారని.. మేము ఉన్నప్పుడు ప్రత్యేక జీవో ఇచ్చాం. ఉద్యోగులకు ఎలా ఉండేదో అలానే జర్నలిస్టులకు ఉండేదని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి మేనల్లుడి మనుషులు నియో పోలీస్‌లో అక్రమ మైనింగ్ చేస్తున్నారు. మొబైల్ క్రషింగ్ ప్లాంట్‌కు మాత్రమే నిబంధనలుండగా ఫిక్స్డ్ క్రషింగ్ ప్లాంట్ నియోపోలీస్లో పెట్టారు. ల్యాండ్ లీజుకు ఇస్తే 6 నుంచి 7 శాతం ఫీజు కట్టాలి. లెటర్లో పది ఎకరాలు ఇస్తే 15 ఎకరాల్లో మైనింగ్ జరుగుతోందని.. 15 లక్షల క్యూబిక్ మీటర్ల బండకు ఫీజు ఎగ్గొట్టారని హరీష్ రావు ఆరోపించారు. అక్కడ రెడీమిక్స్‌కు పర్మిషన్ లేదన్నారు.
Pahalgam Attack: పెహల్గామ్ ఉగ్రదాడి.. చైనా సాయం కోరిన ఎన్ఐఏ కోర్టు
Dragon | మే 20న ‘డ్రాగన్’ విస్ఫోటనం .. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కోసం మేకర్స్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు!
Sircilla | సిరిసిల్ల జిల్లాలో ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి.. 10 మందికి గాయాలు