Amazon Laptop Days Sale | బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు కలిగిన ఓ ల్యాప్‌టాప్‌ను కొనాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే అమెజాన్ ఓ సేల్‌ను ప్రారంభించింది. అమెజాన్‌లో ల్యాప్‌టాప్ డేస్ సేల్ పేరిట ఓ ప్రత్యేక సేల్‌ను కేవలం ల్యాప్‌టాప్ కొనుగోలుదారుల కోసమే నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రముఖ బ్రాండ్లకు చెందిన ల్యాప్‌టాప్‌లను చాలా తగ్గింపు ధరలకే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. హెచ్‌పీ, అసుస్, లెనోవో, డెల్, ఏసర్ వంటి కంపెనీలు ఈ సేల్‌లో తగ్గింపు ధరలకే ల్యాప్‌టాప్ లను అందిస్తున్నాయి. కేవలం రూ.12,990 ప్రారంభ ధరకు ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లను కొనే అవకాశం కల్పించారు. ఈ సేల్ ఇప్పటికే ప్రారంభం కాగా జూన్ 6వ తేదీ వరకు కొనసాగనుంది.
ఈ సేల్‌లో భాగంగా ఏఎక్స్ఎల్ వాయుబుక్ ల్యాప్‌టాప్‌ను రూ.12,990 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇందులో 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ను అందిస్తున్నారు. అసుస్ వివోబుక్ 15 ల్యాప్‌టాప్‌ను రూ.30,990కు కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. అసుస్ వివోబుక్ 14 థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్‌ను రూ.30,990కి కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌ను ఇస్తున్నారు. ఏసర్ ఆస్పైర్ లైట్ థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్‌ను రూ.31,790 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, విండోస్ 11 హోమ్, 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌ను ఇస్తున్నారు.
ఫుటోపియా అల్టిమస్ ఏపెక్స్ 5 ల్యాప్ టాప్ ధర డిస్కౌంట్ అనంతరం రూ.33,990గా ఉంది. దీంట్లో ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌ను ఇస్తున్నారు. డెల్ ఇన్స్పిరాన్ 3530 థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్ ను ఈ సేల్‌లో రూ.37,886 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇందులోనూ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. లెనోవో ఐడియా ప్యాడ్ 3 ల్యాప్‌టాప్ ధర రూ.47,290 ఉండగా ఇందులో ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. లెనోవో ఐడియా ప్యాడ్ 1 ల్యాప్ టాప్ ధర రూ.29,490 ఉండగా ఇందులో ఏఎండీ రైజెన్ 3 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. అలాగే ఎంఎస్ఐ కు చెందిన పలు ల్యాప్ టాప్‌లను కూడా వినియోగదారులు ఈ సేల్‌లో తగ్గింపు ధరలకే కొనుగోలు చేయవచ్చు.
ఇక ఆయా ల్యాప్‌టాప్‌లపై పలు బ్యాంకు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. దీంతో మరింత తగ్గింపు ధరకే ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు ఈఎంఐతో కొంటే రూ.3000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు ఈఎంఐతో అయితే రూ.1750, ఫెడరల్ బ్యాంకు క్రెడిట్ కార్డు ఈఎంఐతో కూడా రూ.1750, వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో రూ.3500 వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్‌ను వినియోగదారులు పొందవచ్చు. మరిన్ని వివరాలకు అమెజాన్‌లో ఇచ్చిన ల్యాప్ టాప్ డేస్ సేల్ పేజీని వినియోగదారులు సందర్శించవచ్చు.