న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో భీకర వర్షాలు కురిశాయి. దీంతో అక్కడ వరదలు వస్తున్నాయి. అస్సాం, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల్లో వర్షాలతో జనజీవనం స్తంభించింది. వరదల వల్ల సుమారు 34 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్, మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లాతో ఇవాళ ప్రధాని మోదీ మాట్లాడారు. వరద విపత్తును ఎదుర్కొనేందుకు సహయం అందించనున్నట్లు చెప్పారు.
ప్రస్తుత పరిస్థితి తెలుసుకునేందుకు ప్రధాని మోదీ ఫోన్ చేసినట్లు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాల వల్ల అస్సాంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనే వరద పరిస్థితి నెలకొన్న విషయాన్ని మోదీకి వివరించినట్లు బిశ్వశర్మ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రిలీఫ్ ఆపరేషన్ గురించి కూడా చెప్పినట్లు తన ఎక్స్‌లో ఆయన వెల్లడించారు. కొన్ని చోట్ల వరదల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి.
A short while ago, Hon’ble Prime Minister Shri @narendramodi ji called me to enquire about the current flood situation in Assam.
I briefed him on how continuous rainfall in Assam and adjoining states has led to flooding and impacted many lives. I also apprised him of the relief…
— Himanta Biswa Sarma (@himantabiswa) June 3, 2025