నల్లబెల్లి, మే 05 : మండలంలో నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశీయులను వెనక్కి పంపాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ మండల నాయకులు తహసిల్దార్ ముప్పు కృష్ణకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ మాట్లాడుతూ మండలంతో పాటు రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యా వలసదారులను వెనక్కి పంపించాలని వినతిపత్రం ఇచ్చామన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి మర్రి నాగరాజు, కోశాధికారి మురికి మనోహర్, జిల్లా నాయకులు పెరుమాండ్ల కోటి, వల్లే పార్వతలు, మండల నాయకులు నాగపూరి సాగర్ గౌడ్, కొనుకటి సుధాకర్, ఈర్ల రవి, తిమ్మాపురం శివ, చాంచు వినయ్,అనుముల బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Donald Trump | సిక్స్‌ప్యాక్‌తో ట్రంప్.. హాలీవుడ్ యాక్షన్ హీరోలా దర్శనమిచ్చిన అధ్యక్షుడు
Red Fort: ఎర్రకోటపై దావా వేసిన మొఘల్ వారసురాలు.. పిటీషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు