మంగళవారం 26 మే 2020
Warangal-city - Apr 12, 2020 , 03:04:23

ప్రతి ధాన్యం గింజనూ కొంటాం

ప్రతి ధాన్యం గింజనూ కొంటాం

  • ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌

నెల్లికుదురు/కేసముద్రం రూరల్‌ : రైతులు  పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అన్నారు. శనివారం ఆయన నెల్లికుదురు మండలంలోని చిన్నముప్పారం, ఎర్రబెల్లిగూడెం గ్రామాల్లో, కేసముద్రం మండ లం ఇనుగుర్తిలో శనివారం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైతు లు కొనుగోలు  కేంద్రాల వద్ద గుంపులు, గుంపులుగా ఉండొద్దని, తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని సూచించారు. అంతకుముందు చిన్నముప్పారంలో 20 పేద కుటుంబాలకు సర్పంచ్‌ ప్రవీణ్‌తో కలిసి ఎమ్మెల్యే సొంతఖర్చులతో నిత్యావసరాలను అందించారు. ఈ కార్యక్రమాల్లో మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ మర్రి రంగారావు, నెల్లికుదురు జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ మాధవి, రైతు సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ బాలాజీనాయక్‌, సొసైటీ చెర్మన్లు వెంకన్న, దేవేందర్‌రావు, జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రునాయక్‌, కేసముద్రం సహకార సంఘం చైర్మన్‌ వెంకన్న, వైస్‌ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, సీఈవో వెంకటాచలం, డైరెక్టర్లు  రాంజీనాయక్‌, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo