Money Management | పరపతి పెంపునకు పంచ సూత్రాలు
వచ్చే ఆదాయాన్ని తెలివిగా వాడుకోవాలంటే బడ్జెట్ తప్పనిసరి. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఖర్చులపై అవగాహనతో ఉండాలి. అప్పుడే చక్కని బడ్జెట్‌తో ఆర్థిక సవాళ్లను అధిగమించగలం. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆన్లైన్ వనరులను, వివిధ యాప్స్‌నూ వాడుకోవచ్చు.
Money Management | 1వచ్చే ఆదాయాన్ని తెలివిగా వాడుకోవాలంటే బడ్జెట్ తప్పనిసరి. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఖర్చులపై అవగాహనతో ఉండాలి. అప్పుడే చక్కని బడ్జెట్‌తో ఆర్థిక సవాళ్లను అధిగమించగలం. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆన్లైన్ వనరులను, వివిధ యాప్స్‌నూ వాడుకోవచ్చు.
2 క్రెడిట్ స్కోర్ బాగుంటే అత్యుత్తమ క్రెడిట్ కార్డులను, తక్కువ వడ్డీకే రుణాలను పొందవచ్చు. ఆర్థిక క్రమశిక్షణతో ముందుకెళ్తే ఆకర్షణీయమైన క్రెడిట్ స్కోర్ మన సొంతం కాగలదు. అవసరానికి మించిన రుణ భారంతో తిప్పలు తప్పవు. అనవసరపు హామీల జోలికి వెళ్లవద్దు.
3 అత్యవసర నిధి తప్పక ఉండాలి. ఏ అవసరం ఎప్పుడు వస్తుందో.. ఏ కష్టం ఏ వైపు నుంచి పుట్టుకొస్తుందో ఊహించలేం. కనుక ముందు జాగ్రత్త అన్నది ముఖ్యం. అందుకే కనీసం మీ ఆరు నెలల అవసరాలు తీరేంత నగదు నిల్వల్ని ఉంచుకోండి. దీనివల్ల ఆపత్కాలంలో అధిక వడ్డీ రుణాలకు దూరంగా ఉండవచ్చు.
4 మీ ఆర్థిక లక్ష్యాల సాధనకు సేవింగ్స్ ఎంతో కలిసొస్తాయి. ప్రధానంగా దీర్ఘకాలిక పొదుపుతో ఎక్కువ ప్రయోజనాలను అందుకోవచ్చు. దీర్ఘకాల సంపద సృష్టికి సిప్ల ద్వారా స్మాల్ సేవింగ్స్ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. చిన్న వయసు నుంచే పొదుపు.. పెద్ద లాభాల్ని తెచ్చిపెట్టగలదు.
5 ఏ రకమైన చెల్లింపులనైనా వాయిదా వేయకుండా సమయానుసారం చెల్లించండి. క్రెడిట్ కార్డ్ బిల్లులను అశ్రద్ధ చేయవద్దు. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. స్థోమతకు మించిన ఆర్థిక భారాన్ని మోయవద్దు. అలాగే ఆరోగ్య బీమా, జీవిత బీమాలకు ప్రాధాన్యం ఇవ్వండి. మనకు, మన కుటుంబ సభ్యులకు బీమానే కొండంత ధీమా.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

