e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home రంగారెడ్డి కొత్త ఒరవడితో సాగు చేయాలి

కొత్త ఒరవడితో సాగు చేయాలి

తలకొండపల్లి, జూలై 30 : నూతన ఒరవడితో రైతులు సాగు చేయాలని పాలెం వ్యవసాయ పరిశోధన ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు రామకృష్ణ, అర్చన అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మండలంలోని జంగారెడ్డిపల్లిలో రైతు భూపాల్‌రెడ్డి పొలంలో ఎంపిక చేసిన 5 రకాల వరి సీడ్‌ను ప్రయోగాత్మకంగా నాటు వేశారు. జిల్లాలో నాలుగు రకాల భూముల్లో ఎంపిక చేసిన సీడ్‌తో వరి సాగు చేపట్టినట్లు తెలిపారు. ఎకరాకు 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చేలా సీడ్‌ ను రూపొందించామన్నారు. సిలింద్రాల ద్వా రా వచ్చే వ్యాధులను అదుపు చేస్తుందన్నా రు. మిని కిడ్స్‌ను క్రమపద్ధతి ద్వారా సాగు చేసేందుకు జంగారెడ్డిపల్లికి చెందిన రైతును ఎంపిక చేసి క్షేత్ర స్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ రాజారత్నం, ఏవో రాజు, ఏఈవో శ్రీవాణి, సర్పంచ్‌ ధరణి పాల్గొన్నారు.

సూచించిన మందులే పిచికారీ చేయాలి
వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనల మేరకు పంటలకు మందులు పిచికారీ చేయాలని ఏవోలు శైలజ, జ్యోతిశ్రీ అన్నారు. శుక్రవారం తాళ్లపల్లి గూడలో జీవనియంత్రణ ప్రయోగాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. సూడమోనాస్‌ ప్లోరోసెన్స్‌ బ్యాక్టీరియా వరిలో వచ్చే అగ్గి తెగుళ్లను, పాముపొడ, ఎండుతెగుళ్లు, నారుకుళ్లు, తెగుళ్లను అరికడుతుందని చెప్పారు. వరి లేదా ఇతర పంటలకు ఎలాంటి తెగుళ్లు సోకినా అధికారులను సంప్రదించి మందులు పిచికారీ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి గ్రామ కోఆర్డ్డినేటర్‌ సత్తిరెడ్డి, ఏఈవో లింగస్వామి, సాయిసిరి, రైతులు రాజేందర్‌రెడ్డి, సత్తయ్య పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana