సోమవారం 26 అక్టోబర్ 2020
Vikarabad - Oct 16, 2020 , 02:16:06

ఆడబిడ్డల కండ్లల్లో ఆనందం

ఆడబిడ్డల కండ్లల్లో ఆనందం

  •  జోరందుకున్న చీరల పంపిణీ 
  •  దసరా కానుకపై సర్వత్రా హర్షం

బొంరాస్‌పేట: దసరా కానుకగా మహిళలకు ప్రభుత్వం సరఫరా చేసిన బతుకమ్మ చీరల పంపిణీ మండలంలో జోరుగా కొనసాగుతున్నది. గురువారం మండలంలోని బాపల్లి తండా, మేడిచెట్టుతండా, బొంరాస్‌పేట గ్రామాల్లో ఎంపీపీ హేమీబాయి, వైస్‌ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి  బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, పండుగ సంతోషంగా జరుపు కోవడానికి మహిళలకు ఏటా బతుకమ్మ పండుగకు కానుకగా చీరలను పంపిణీ చేస్తున్నార న్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కవిత, జ్యోతి, జయమ్మ, ఉప సర్పంచ్‌ అంజిలయ్య,  టీఆర్‌ఎస్‌ యూత్‌ మండల అధ్యక్షుడు మహేందర్‌, పార్టీ నాయకులు సుభాష్‌రావు, శేఖర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

నవాబుపేట: మండల కేంద్రంలో  ఎంపీపీ భవాని మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణి చేశారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా అవసరాలను గుర్తిం చి వారికి కావాల్సినవి, అనుకూలమైన పథకాలను అమలు చేస్తున్నదన్నారు. ప్రతి పథకం ఆదర్శప్రాయమనేని ఆమె కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ విజయలక్ష్మి ప్రకాశ్‌, ఎంపీటీసీ పద్మానాగిరెడ్డి పాల్గొన్నారు.

ధారూరు:  స్టేషన్‌ ధారూరు గ్రామంలో దసరా పండుగ కానుకగా ఆడపడుచులకు బతు కమ్మ చీరలు సర్పంచ్‌ రేణుక శ్రీనివాస్‌ తో కలిసి ఎంపీపీ విజయలక్ష్మి పంపిణీ చేశారు.  మోమిన్‌ఖుర్ధు గ్రామంలో  ధారూరు తాసిల్దార్‌ భీమయ్యగౌడ్‌, సర్పంచ్‌ ఉమాదేవి పంపిణీ చేశారు.   నర్సాపూర్‌ గ్రామంలో ఎంపీటీసి బసప్ప సర్పంచ్‌ చంద్రయ్య బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ధారూరు వైస్‌ ఎంపీపీ విజయ్‌కుమార్‌, ఉప సర్పంచ్‌ యాదయ్య, చంద్రరెడ్డి పౌండేషన్‌ అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి,  పంచాయతీ కార్యదర్శి అంజన్‌ నాయక్‌, ధారూరు పీఏసీఎస్‌ డైరెక్టర్లు సుధాకర్‌ గౌడ్‌, వార్డు సభ్యులు, నాయకులు యూనుస్‌, శ్రీనివాస్‌, బాల్‌రాజ్‌ నాయక్‌, శ్రీను, గోవింద్‌, రాజ్‌గౌడ్‌, ప్రకాశ్‌, యాదయ్య, ఆశోక్‌, రాజు, శ్రీకాంత్‌, పాండు, శేఖర్‌  పాల్గొన్నారు.

మోమిన్‌పేట్‌: మండల పరిధిలోని టేకులపల్లి, ఎన్కతల, రాళ్లగూడుపల్లి, రాంనాథ్‌ గుడూ పల్లి, లచ్చానాయక్‌ తండా, ఆమ్రాదికలాన్‌ గ్రామాల్లో ఆయా గ్రామ సర్పంచ్‌లు బతకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మోమిన్‌పేట్‌ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి , ఎంపీటీసీలు కృష్ణారెడ్డి,ఆశమ్మ ఆయా గ్రామ సర్పంచ్‌లు నవనీతరెడ్డి , అలి వేలమ్మ, సావిత్రమ్మ, జగదీశ్వర్‌,లలిత పాల్గొన్నారు.


logo