తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన స్టాలిన్
తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన స్టాలిన్ | తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా ముత్తువేళ్ కరుణానిధి స్టాలిన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు.

చెన్నై : తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా ముత్తువేళ్ కరుణానిధి స్టాలిన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కొవిడ్ ప్రొటోకాల్స్ మధ్య ఈ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. స్టాలిన్ అనంతరం 34 మంది మంత్రులు సైతం ప్రమాణం స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు.
మక్కల్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్, డీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు, కొందరు కీలక నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన వెంటనే కేబినెట్ సమావేశమై.. కరోనా నివారణ చర్యలపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్యే, సినీ నటుడు ఉదయనిధి ప్రత్యేక ఆకర్షణగా నిలువగా.. స్టాలిన్ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ఆయన భార్య ఉద్వేగానికి లోనయ్యారు.

ఇవి కూడా చదవండి..
రాష్ట్రానికి మరో మూడు రోజులు వర్ష సూచన
చైనా రాకెట్‌పై అమెరికా సైన్యానికి ప్రణాళిక లేదు : లాయిడ్ ఆస్టిన్
రాజస్థాన్‌లో 14 రోజుల లాక్డౌన్
టీ తోట కార్మికులపై కరోనా పంజా.. 133 మంది పాజిటివ్
ముంబైలో ఎయిర్ అంబులెన్స్ అత్యవసర ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం
ఛత్తీస్‌గఢ్ జైలు నుంచి ఐదుగురు ఖైదీల పరారీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

