చైనా రాకెట్‌పై అమెరికా సైన్యానికి ప్రణాళిక లేదు : లాయిడ్ ఆస్టిన్
చైనా రాకెట్‌పై అమెరికా సైన్యానికి ప్రణాళిక లేదు : లాయిడ్ ఆస్టిన్ | భూమి వైపు దూసుకువస్తున్న చైనా రాకెట్ లాంగ్‌మార్చ్‌ను పేల్చివేసేందుకు అమెరికా సైన్యానికి ఎలాంటి ప్రణాళిక లేదని అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు.

వాషింగ్టన్ : భూమి వైపు దూసుకువస్తున్న చైనా రాకెట్ లాంగ్‌మార్చ్‌ను పేల్చివేసేందుకు అమెరికా సైన్యానికి ఎలాంటి ప్రణాళిక లేదని అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ‘మాకు చాలా పనులు చేయగల సామర్థ్యం ఉంది. కానీ, దాన్ని పేల్చివేసేందుకు అమెరికా సైన్యానికి ఎలాంటి ప్రణాళిక లేదు’ అని పేర్కొన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) ప్రత్యామ్నాయంగా, తమ కోసం ప్రత్యేకంగా ‘టియాన్హే’ పేరిట ఓ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని చైనా ఓ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో భాగంగా గత గురువారం ‘లాంగ్ మార్చ్ 5బీ’ రాకెట్‌ను ప్రయోగించగా.. కొంత సామగ్రిని రాకెట్ కక్ష్యలో ప్రవేశపెట్టిన అనంతరం ఆ రాకెట్ శకలాలు పొరపాటున మరో తాత్కాలిక కక్ష్యలోకి చేరాయి.
నియంత్రణ కోల్పోయిన ఆ శకలాలు అక్కడినుంచి భూమి వైపునకు వేగంగా దూసుకువస్తున్న విషయం తెలిసిందే. రాకెట్ శకలాలు శని, ఆదివారాల్లో భూ ఉపరితలంపైకి వస్తుందని పెంటగాన్ నిపుణులు భావిస్తున్నారు. కానీ, ఎప్పుడు.. ఎక్కడ ల్యాండ్ అవుతుందో ఊహించడం ఇంకా కష్టమని పేర్కొన్నారు. అయితే, ఎవరికీ హాని కలని ప్రదేశంలో శకలాలు పడుతాయని భావిస్తున్నామని ఆస్టిన్ చెప్పారు. రాకెట్ శకలాలు మరో కక్ష్యలో పడకుండా చూడడంలో చైనీయులు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. అంతరిక్షంలో సురక్షితమైన, ఆలోచనాత్మకమైన రీతిలో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘మేం అంతరిక్ష ప్రణాళికలు, కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ రకమైన విషయాలను పరిగణలోకి తీసుకుంటాం’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రానికి మరో మూడు రోజులు వర్ష సూచన
మూడోవేవ్‌కు సన్నద్ధంగా ఉండండి
ఏపీ, తెలంగాణ నుంచి ఢిల్లీకి వస్తే 14 రోజుల క్వారంటైన్
హోమియో‘మందు’ తాగి 9 మంది మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

