మూడోవేవ్‌కు సన్నద్ధంగా ఉండండి
- ఆక్సిజన్ బఫర్ స్టాక్‌ను ఏర్పాటు చేయండి
- అక్కడి నుంచే దవాఖానలకు సరఫరా
- సరఫరా విధానాన్ని మార్చుకోవాలి
- కేంద్రానికి సుప్రీంకోర్టు సూచనలు

న్యూఢిల్లీ, మే 6: కరోనా మూడో వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు కేంద్రం పూర్తి సన్నద్ధంగా ఉండాలని, దేశవ్యాప్తంగా నగరాల్లో ఆక్సిజన్ అదనపు నిల్వల కేంద్రాలను (బఫర్ స్టాక్ కేంద్రాలు) ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దవాఖానలకు ఆక్సిజన్ అవసరం పడితే బఫర్ స్టాక్ కేంద్రాలను సంప్రదించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దేశంలో కరోనా మూడో వేవ్ అనివార్యమని, అది ఇంకా ప్రమాదకరమని, ముఖ్యంగా చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించిన నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఆక్సిజన్ సరఫరాపై కేంద్రం తన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది’ అని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ నిల్వలపై ఆడిట్ నిర్వహించి, వివరాలు అందుబాటులో పెట్టాలని అవసరమైన చోట తగినంత అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ‘కేంద్రం పంపిన ఆక్సిజన్ సరఫరా ఎలా జరుగుతున్నది? పంపిన దవాఖానకే వెళ్తుందా? బ్లాక్ మార్కెట్‌కు వెళ్తుందా? ఆక్సిజన్ సరఫరాపై ఏదైనా పారదర్శక వ్యవస్థ ఉన్నదా?’ అని ప్రశ్నించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు ఢిల్లీకి రోజుకు 700 టన్నుల కంటే తక్కువగా ఆక్సిజన్ సరఫరా చేయవద్దని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

