Madhavi Latha | రూ.218 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించిన బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత
Madhavi Latha | హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి (Hyderabad BJP Candidate) కొంపెల్ల మాధవీలత (Madhavi Latha) తన కుటుంబ చర, స్థిరాస్తుల విలువ రూ.218 కోట్లుగా వెల్లడించారు.
Madhavi Latha | తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు ఇప్పటికే తమ నామినేషన్లను దాఖలు చేశారు (nomination papers). ఈ సందర్భంగా పలువురు నేతలు వారు సమర్పించిన అఫిడవిట్లలో ఆస్తులు, అప్పుల వివరాలను కూడా వెల్లడించారు (Assets). ఇక హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి (Hyderabad BJP Candidate) కొంపెల్ల మాధవీలత (Madhavi Latha) తన కుటుంబ చర, స్థిరాస్తుల విలువ రూ.218 కోట్లుగా వెల్లడించారు.
హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి మాధవీలత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. తన కుటుంబ చరాస్తుల విలువ రూ. 165.46 కోట్లు కాగా, స్థిరాస్తుల విలువ రూ. 55.92 కోట్లుగా వెల్లడించారు. మొత్తం రూ.27.03 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
విరించి లిమిటెడ్, వినో బయోటెక్‌లలో తన పేరిట రూ.8.92 కోట్ల విలువైన షేర్లు, తన భర్త కొంపెల్ల విశ్వనాథ్ పేరిట రూ.56.19 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా అన్‌లిస్టెడ్ కంపెనీలైన గజ్వేల్ డెవలపర్స్, పీకేఐ సొల్యూషన్స్, విరా సిస్టమ్స్‌లలో తన పేరిట రూ.16.27 కోట్ల షేర్లు, తన భర్త పేరిట రూ.29.56 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు అఫిడవిట్లో పొందుపరిచారు.
ఇక మొత్తం ఇద్దరి పేరిట 5 కిలోల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో 3.9 కిలోలు తన పేరుమీద కాగా, 1.11 కిలోల బంగారు ఆభరణాలు తన భర్త పేరిట ఉన్నట్లు వివరించారు. అయితే, సొంతంగా ఎలాంటి వ్యవసాయ భూములు, వాహనాలు లేవని పేర్కొనడం గమనార్హం. తనపై ఒక క్రిమినల్ కేసు కూడా ఉన్నట్లు మాధవీలత తన ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. ఇక తాను పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసినట్లు పేర్కొన్నారు.
Also Read..
Landslide | అరుణాచల్ ప్రదేశ్‌లో భారీగా విరిగిపడ్డ కొండచరియలు.. కొట్టుకుపోయిన జాతీయ రహదారి
Plane Crashes | జైసల్మేర్‌లో కుప్పకూలిన వాయుసేనకు చెందిన నిఘా విమానం
JDU Leader | నితీశ్ కుమార్ పార్టీ నేత దారుణ హత్య
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

