సీఎంగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్.. కరోనా సాయం ఫైలుపై తొలి సంతకం
MK Stalin: తమిళనాడులో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

చెన్నై: తమిళనాడులో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు చెన్నైలోని తమిళనాడు సెక్రెటేరియట్‌కు వెళ్లిన ఆయన సీఎం కుర్చీలో ఆసీనులై బాధ్యతల స్వీకార పత్రంపై సంతకం చేశారు. అంతకుముందు ఆయన రాజ్‌భవన్‌లో తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ఆయన చేత ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన తన తండ్రి కరుణానిధి స్మృతి వనం దగ్గరికి వెళ్లి నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరుగా సెక్రెటేరియట్‌కు వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఉచితంగా కరోనా పరీక్షలు
ఈ సందర్భంగా ఆయన కరోనా సాయం ఫైలుపై తొలి సంతకం చేశారు. దాంతో కరోనా సాయం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.4000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఈ ఆర్థిక సాయాన్ని మే, జూన్ నెలల్లో రెండు విడుతలుగా రెండేసి వేల చొప్పున అందించనున్నారు. మొదటి విడుత రూ.2000 చొప్పున ఈ నెలలోనే ఇవ్వనున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన బీమా కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ కరోనా చికిత్సలకు అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్టాలిన్ ప్రకటించారు.
లీటర్ పాలపై రూ.3 తగ్గింపు
అంతేగాక, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఫైలుపై కూడా స్టాలిన్ సంతకం చేశారు. పాల ధరలను కూడా ఆయన తగ్గించారు. ప్రతి లీటర్ పాలపై రూ.3 చొప్పున తగ్గించనున్నట్లు వెల్లడించారు.
Chennai: MK Stalin takes charge as the Chief Minister of Tamil Nadu at the Secretariat. pic.twitter.com/gbo4MJkNBJ
— ANI (@ANI) May 7, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పావురం కాలికి చిప్.. గూఢచర్యమేనా..!
వరుసగా రెండో రోజూ 4 లక్షలు దాటిన కరోనా కేసులు
తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన స్టాలిన్
పురివిప్పిన మయూరం.. కనువిందు చేసిన నాట్యం.. వీడియో
వర్షాలు కురువాలని కప్పలకు పెండ్లి..వీడియో
తెలంగాణలో కొత్తగా 5,892 కరోనా కేసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

